టీచర్‌‌పై సర్పంచ్ భర్త మిస్‌ బిహేవ్

టీచర్‌‌పై సర్పంచ్ భర్త మిస్‌ బిహేవ్
  • లిఫ్ట్ ఇస్తానని పొలాల్లోకి తీస్కపోయిండు
  • రిమాండ్‌కు తరలించిన పోలీసులు 

అచ్చంపేట, వెలుగు: ఓ గ్రామ సర్పంచ్​భర్త  టీచర్‌‌తో అసభ్యంగా ప్రవర్తించాడు.  సిద్దాపూర్​ఎస్సై గురు స్వామి  వివరాల ప్రకారం..  అచ్చంపేట మండలం దేవుల తండాలో పనిచేస్తున్న టీచర్‌‌ సెప్టెంబర్‌‌ 1న స్కూల్స్‌ రీఓపెన్ కావడంతో స్కూల్‌కు వెళ్లింది. స్కూల్‌ అయిపోయాక ఇంటికి వెళ్లేందుకు ఆటో కోసం వెయిట్ చేస్తుండగా..  అక్కడికి వచ్చిన సర్పంచ్ భర్త పంతూలాల్​ సిద్దాపూర్​ వరకు వెళ్తున్నానని  లిఫ్ట్‌ ఇస్తానని బైక్​ఎక్కించుకున్నాడు. మార్గమధ్యలోకి వెళ్లగానే వ్యవసాయ పొలాలకు వెళ్లే  దారిలోకి బైక్‌ను మళ్లించాడు. దీంతో భయపడ్డ టీచర్‌‌ ఆపమని కోరింది. అయినా వినకపోవడంతో బైక్​పై నుంచి కిందకు దూకింది.  రోడ్డుపైకి  చేరుకొని మరో వ్యక్తి సాయంతో అచ్చంపేటకు చేరుకుని జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. వారితో కలిసి సిద్దాపూర్​ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా..  పంతూలాల్‌పై​కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.