
ఇండియన్ స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి జోడి రికార్డు నెలకొల్పారు. స్విస్ ఓపెన్ 2023 సూపర్ సిరీస్ టైటిల్ సాధించారు. ఫైనల్‌లో చైనీస్ జోడి రెన్ జియాంగ్ యు- టాన్ క్వియాంగ్‌లపై 21-19, 24-22 తేడాతో సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి - చిరాగ్ శెట్టి జోడి విజయం సాధించింది.
పూర్తి ఆధిపత్యం..
ఫైనల్లో చైనా జంటపై చిరాగ్ శెట్టి సాత్విక్ జోడి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి సెట్ ను 21-19 స్కోరు తేడాతో ఫస్ట్ సెట్ ను దక్కించుకుంది. అయితే రెండో సెట్ లో మాత్రం చైనా జంట భారత్ జోడికి కొద్దిగా పోటీనిచ్చింది. కానీ కీలక సమయంలో అద్భుతమై ఆటతీరును ప్రదర్శించిన సాత్విక్-చిరాగ్ శెట్టి..రెండో సెట్ ను 24-22 స్కోరు తేడాతో గెలిచి టైటిల్ ను సాధించింది.
చరిత్ర..
ఈ విజయంతో 68 ఏళ్ల స్విస్ ఓపెన్ చరిత్రలో డబుల్స్ టైటిల్ గెలిచిన తొలి భారత్ జోడీగా సాత్విక్ చిరాగ్ శెట్టి చరిత్ర సృష్టి్ంచారు. 1955లోస్విస్ ఓపెన్ సూపర్ 300 సిరీస్ ప్రారంభమైంది. అయితే ఇప్పటిదాకా భారత జంట ఒక్కసారి కూడా డబుల్స్‌లో టైటిల్ సాధించలేదు. ఉమెన్స్ సింగిల్స్ లో మాత్రం సైనా నెహ్వాల్ 2011, 2012లో విజేతగా నిలిచింది. ఆ తర్వాత 2015లో మెన్స్ సింగిల్స్ లో కిడాంబి శ్రీకాంత్, 2016లో ప్రణయ్ స్విస్ ఓపెన్ టైటిల్స్ సాధించారు. 2018లో సమీర్ వర్మ కూడా స్విస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో స్విస్ ఓపెన్ గెలిచాడు. 2022 సీజన్‌లో పీవీ సింధు తొలిసారిగా స్విస్ ఓపెన్ టైటిల్‌ని దక్కించుకుంది.