బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో ప్రతిపక్షాలు బిత్తరపోయాయి: మంత్రి సత్యవతి

బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో ప్రతిపక్షాలు బిత్తరపోయాయి: మంత్రి సత్యవతి

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన భారత రాష్ట్ర సమితి( బీఆర్ఎస్) పార్టీ  మ్యానిఫెస్టోతో ప్రతిపక్షాలు బిత్తరపోయి ఆగం ఆగమవుతున్నాయని  మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లాలో 2023, అక్టోబర్ 17వ తేదీన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంపి కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, జైడ్పీ చైర్మన్ బిందు, మున్సిపాల్ చైర్మన్ రాం మెహన్ రెడ్డిలతో పాటు మంత్రి సత్యవతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ... ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల సమరానికి వెళ్లిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు.

కాంగ్రెస్, బీజేపీ పార్టీలు  కనీసం అభ్యర్థులను ప్రకటించని దుస్థితిలో ఉన్నాయన్నారు.  ఇక, కాంగ్రెస్.. అమలుగాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడానికి సిద్ధం అవుతుందని మంత్రి మండిపడ్డారు.  రైతుల పట్ల గానీ, వ్యవసాయం పట్ల గానీ అవగాహన లేని నాయకుడు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండూ ఒకటేనని, సిఎం కెసిఆర్ పాలనలో సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 45 లక్షల మందికి పెన్షన్ లను అందచేస్తున్నామని మంత్రి చెప్పారు.