పాత ప్లాస్టిక్​తో స్కూల్​ బెంచీలు

V6 Velugu Posted on Aug 19, 2021

మన దేశంలో క్రియేటివిటీకి కొదవే లేదని మరోసారి ప్రూవ్ చేశాడు గుజరాత్​కి చెందిన రాహుల్ చౌదరి . ఆలోచించాలే కాని పనికిరాని వాటితో కూడా ఏదో ఒకటి కొత్తగా సృష్టించొచ్చు అంటాడాయన. ఆ ఆలోచనతోనే పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్​ వేస్ట్​ని రీసైకిల్ చేసి, దాంతో క్లాస్​ రూం బెంచ్​లు తయారుచేస్తున్నాడు. ఇవి పదిహేనేళ్లు పాడవ్వవు అంటున్నాడు రాహుల్​. దాదాపు 80 వేల టన్నుల ప్లాస్టిక్​ చెత్తని, టూత్​పేస్ట్ ట్యూబ్​లని రీసైకిల్​ చేస్తున్నాడు. రీసైకిల్​ చేసిన మెటీరియల్​తో ఫైర్​ రెసిస్టెంట్, వాటర్​ ప్రూఫ్​, టెర్మైట్​ ఫ్రూవ్​, హీట్ రెసిస్టెంట్ ​షీట్స్​ తయారుచేస్తున్నాడు. వాటిని స్కూల్​ బెంచ్​లు, ఇంటి పైకప్పులు వంటి వాటికి వాడతారట.
ప్లాస్టిక్​ వేస్ట్​తో ప్యానెల్స్​
పొద్దున లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునేదాకా ప్లాస్టిక్​ వస్తువుల్ని వాడుతూనే ఉంటాం. ప్లాస్టిక్ బ్రష్​, టూత్​ పేస్ట్ ట్యూబ్​ కూడా ప్లాస్టిక్​. అంటే లేచిన దగ్గరి నుంచి ప్లాస్టిక్​ లేకుండా రోజు గడవదు. అంతేకాదు, టూత్ పేస్ట్ ట్యూబ్​ని ‘మల్టీ లేయర్​ ప్లాస్టిక్​’ (ఎం.ఎల్​.పి)తో తయారుచేస్తారు. అంటే అది మామూలు ప్లాస్టిక్ కంటే ఎక్కువ హానికరమైంది. ఇదొక్కటే కాదు, బిస్కెట్, చాక్లెట్, టెట్రా ప్యాక్స్, ఇతర ఫుడ్ ప్యాకెట్స్ వంటి వాటి నుంచి ప్లాస్టిక్​ వేస్ట్ వస్తోంది. ఇవన్నీ మల్టీ లేయర్​ ప్లాస్టిక్​తో తయారుచేసినవే. ఇవి సింగిల్​ లేయర్​ ప్లాస్టిక్​ సంచుల కంటే ఎక్కువ హానికరం. ఇలాంటి ప్యాకేజింగ్​ల కోసం 45 శాతం ప్లాస్టిక్​ వాడుతున్నారు. రోజంతా వాడే వాటిలో ఇంత ప్లాస్టిక్​ వేస్ట్ తయారవుతుంటే, పర్యావరణం దెబ్బతింటుంది. మరి దీనికి సొల్యూషన్​ ఏంటి? అనే ప్రశ్నకు సమాధానమే రాహుల్‌‌‌‌కి వచ్చిన ఆలోచన ‘రిక్రాన్​ ప్యానెల్స్​’. రీసైకిల్ చేసిన మెటీరియల్​తో బెంచ్​లు, రూఫ్​లుగా తయారుచేసినవే రిక్రాన్​ ప్యానెల్స్​​. 
2014 గుజరాత్​లో టెక్​ స్టార్టప్​ని మొదలుపెట్టాడు. దాని ద్వారా మల్టీ లేయర్​ ప్లాస్టిక్​ వేస్ట్​ని క్లాస్​రూంలో వాడే బెంచ్​లు, టాయిలెట్స్ వంటి మెటీరియల్స్​కి వాడుతున్నారు. ఈ కంపెనీలో ప్రతిరోజూ ఐదు వందల టన్నుల మల్టీ లేయర్​ ప్లాస్టిక్ వేస్ట్​ని రీసైకిల్​ చేస్తున్నారు. ఈ కంపెనీ మల్టీ లేయర్​ ప్లాస్టిక్​ వేస్ట్​ని తక్కువ రేటుకి కొంటుంది. ఇప్పుడు మన దేశమంతటా ఈ ప్రొడక్ట్స్​ని తయారుచేయించే ప్లాన్​లో ఉన్నారు. ఇప్పటికే పర్యావరణాన్ని కాపాడేందుకు రాహుల్​ చేస్తున్న కృషికిగానూ 2019లో కాన్ఫెడరేషన్​ ఆఫ్ ఇండియన్​ ఇండస్ట్రీ నుంచి ‘గ్రీన్​ ప్రొ సర్టిఫికేషన్​ అవార్డ్’, వరల్డ్ వైల్డ్​ లైఫ్ ఫండ్ నుంచి ‘క్లైమేట్ సాల్వర్​ అవార్డ్’లు దక్కాయి. 

Tagged school, , benches, old plastic

Latest Videos

Subscribe Now

More News