ఢిల్లీలో స్కూళ్లు రీఓపెన్

ఢిల్లీలో స్కూళ్లు రీఓపెన్

దేశ రాజధానిలో స్కూళ్లు తిరిగి తెరుచుకోనున్నాయని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తెలిపారు. నవంబర్ 1 నుంచి ఢిల్లీలోని అన్ని స్కూళ్లలో క్లాంపస్ క్లాసులు మొదలవుతాయన్నారు. పిల్లల్ని బడులకు పంపే విషయంపై పేరెంట్స్‌ను బలవంతం చేయబోమని స్పష్టం చేశారు. అదే సమయంలో క్లాసులకు హాజరు కాలేని విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు కొనసాగుతాయన్నారు. 

పిల్లల్ని స్కూళ్లకు తప్పనిసరిగా పంపాలని తల్లిదండ్రులను బలవంతం చేయొద్దని నిపుణులు సూచించినట్లు సిసోడియా తెలిపారు. టీచింగ్, నాన్ టీచింగ్‌ స్టాఫ్‌కు కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ తీసుకునేలా చూడాలన్నారు. అలాగే సింగిల్ డోసు టీకా తీసుకున్న వారికి త్వరగా రెండో డోసు కూడా ఇప్పించాలని ఆదేశించారు. 6 నుంచి 8వ తరగతుల విద్యార్థులకు స్కూళ్లు రీఓపెన్ చేయాలని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (డీడీఎంఏ) ప్యానెల్ సూచనల తర్వాతే ఆప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

మరిన్ని వార్తల కోసం: 

బీజేపీలో చేరనున్న మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్?

2500 నాటికి.. ఇండియా ఇట్లుంటదట!

కివీస్‌తో మ్యాచ్.. గెలవకుంటే భారత్‌‌కు కష్టమే