ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టులు: 7. సైంటిస్ట్–సి, సైంటిస్ట్–డి, సైంటిస్ట్–ఈ.
ఎలిజిబిలిటీ: అభ్యర్థులు ప్రతి పోస్టుకు సూచించిన విధంగా నిర్దిష్ట అనుభవంతో సంబంధిత సబ్జెక్టులో ఎంబీబీఎస్ , బీవీఎస్సీఏహెచ్/ మాస్టర్స్/ పీహెచ్ డీ కలిగి ఉండాలి. పోస్టుల వారీగా వివరణాత్మక అర్హతల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.
వయోపరిమితి: సైంటిస్ట్- సికు 40 ఏండ్లు, సైంటిస్ట్- డికు 45 ఏండ్లు, సైంటిస్ట్ -ఇకు 50 ఏండ్లు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: నవంబర్ 21.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళలు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మినహాయింపు ఇచ్చారు.
లాస్ట్ డేట్: డిసెంబర్ 22.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, కంప్యూటర్ ఆధారిత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉంటుంది.
పూర్తి వివరాలకు recruit.icmr.org.in వెబ్సైట్లో సంప్రదించగలరు.
