
- స్టాక్ బ్రోకర్స్ నిబంధనలు ఉల్లంఘించినందుకే
న్యూఢిల్లీ: స్టాక్ బ్రోకర్స్ నిబంధనలు ఉల్లంఘించినందుకు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌కు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) రూ.3 లక్షల ఫైన్ వేసింది. 45 రోజుల్లోగా ఈ ఫైన్ చెల్లించాలని ఆదేశించింది. ఏప్రిల్ 2022 నుంచి జనవరి 2024 వరకు మోతీలాల్ ఓస్వాల్‌పై దర్యాప్తు నిర్వహించింది. ట్రేడింగ్ టెర్మినల్స్ ఆథరైజ్డ్ (అనుమతి పొందిన) ప్లేస్‌లలో లేవని గుర్తించింది.
ఎన్‌ఎస్‌ఈ కోసం 13 టెర్మినల్స్ ఉండాల్సిన లొకేషన్‌లో లేవు. అందులో 5 టెర్మినల్స్ నుంచి ట్రేడ్స్ జరిగాయి. 4 టెర్మినల్స్‌ను అనుమతులు పొందిన వారు కాకుండా వేరే వాళ్లు ఆపరేట్ చేశారు. బీఎస్‌ఈ కోసం 9 టెర్మినల్స్ రిపోర్టెడ్ లొకేషన్‌లో లేవు. ఒక టెర్మినల్ నుంచి ట్రేడ్స్ జరిగాయి. 4 టెర్మినల్స్‌ను ఆప్రూవ్డ్ యూజర్స్ కాకుండా ఇతరులు ఉపయోగించారు. స్టాక్ బ్రోకర్ రూల్స్ ప్రకారం, ట్రేడింగ్ టెర్మినల్స్‌ను అన్‌ఆథరైజ్డ్ పర్సన్స్ లేదా ప్లేస్‌లలో ఉపయోగించడం వల్ల ఫైనాన్షియల్ పెనాల్టీ విధిస్తారు.