బ్రిటన్ పార్లమెంట్‌లో బయటపడ్డ సీక్రెట్ డోర్

బ్రిటన్ పార్లమెంట్‌లో బయటపడ్డ సీక్రెట్ డోర్

బ్రిటన్ పార్లమెంట్‌లో పురాతన సీక్రెట్ డోర్‌ను గుర్తించారు ఆ దేశ అధికారులు. పార్లమెంట్ రీస్టోరేషన్ కోసం ప్రభుత్వం ప్రాజెక్ట్ చేపట్టింది. ఆ ప్రాజెక్ట్‌లో భాగంగా పార్లమెంట్ ఆర్కిటెక్చర్ అండ్ హెరిటేజ్ టీం, భవనాన్ని పరిశీలించింది. ఆ పరిశీలనలోనే సీక్రెట్ డోర్‌ను అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని బ్రిటన్ పార్లమెంట్ బుధవారం ప్రకటించింది. 17వ శతాబ్దం నాటి ఆ డోర్ హౌస్ ఆఫ్ కామన్స్ అడుగున ఉన్నట్టు పేర్కొంది. 1661లో కింగ్ చార్లెస్ పట్టాభిషేకం సందర్భంగా దానిని నిర్మించినట్టు చెబుతున్నా రు. ‘‘పార్లమెంట్ బిల్డింగ్‌కు సంబంధించి స్వీడన్‌లోని హిస్టారిక్ ఇంగ్లాండ్ ఆర్కైవ్స్‌లో ఉన్న 10 వేల డాక్యుమెంట్లను పరిశీలిస్తుండగా వెస్ట్ మినిస్టర్ హాల్ వెనక ఈ డోర్ ఉన్నట్టు తెలుసుకున్నాం ’’ అని ప్రాజెక్ట్‌లో భాగమైన హిస్టరీ ప్రొఫెసర్ లిజ్ హలాం స్మిత్ తెలిపారు. ఆ డోర్ ఎక్కడుందో తెలుసుకునేందుకు టీం ప్రయత్నించిందని, ఆ ప్రయత్నంలోనే రెండు మూడున్నర మీటర్ల ఎత్తైన చెక్క డోర్లను గుర్తించిందని, వాటి వెనకే హౌస్ ఆఫ్ కామన్స్‌కు కనెక్ట్ అయ్యే ఈ సీక్రెట్ డోర్ ఉందని చెప్పారు. చెట్ల వయసును లెక్కగట్టే డెండ్రోక్రోనాలజీ ఆధారంగా ఆ చెక్కలు 1659 నాటివని గుర్తించామన్నారు. హౌస్ ఆఫ్ లార్డ్స్ ఉండే ప్రాంతం నుంచి రాజు, రాణి ఉండే అంత:పురాన్ని ఆ దారి కలుపుతుందన్నారు. ఆ సీక్రెట్ డోర్ ఒక్కటే కాదు, 1834లో మేషన్లు గోడపై పెన్సిల్‌తో రాసిన గ్రాఫిటీని అధికారులు గుర్తించారు. ఇన్నేళ్లయినా ఆ గ్రాఫిటీ చెక్కుచెదరలేదంటున్నారు. అంతేకాదు, ‘ఔల్డ్ ఆలేకు అత్యంత ఇష్టమైన
టామ్ పీటర్ గది ఇది’ అని గోడ మీద రాసున్నట్టు గుర్తించారు.

For More News..

యూత్‌కు ఉపాధి కోసం ‘కేసీఆర్ ఆపద్బంధు’

రూ. 50 ఇయ్యలేదని చిన్నారి ఆత్మహత్య