కరోనా కేసులు పెరగడంతో గౌతంబుద్ధనగర్లో 144 సెక్షన్

 కరోనా కేసులు పెరగడంతో గౌతంబుద్ధనగర్లో 144 సెక్షన్

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3 వేల 157 పాజిటివ్ కేసులొచ్చాయి. ఢిల్లీలోనే 1,485 కేసులు నమోదైనట్లు తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 19 వేల 500 కు పెరిగాయి. కొవిడ్ వల్ల మరో 26 మంది చనిపోయారు. వైరస్ నుంచి మరో 2 వేల 723 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 189 కోట్లకు పైగా కరోనా టీకా డోసులు పంపిణీ చేసింది కేంద్రం. కరోనా కేసులు పెరగడంతో గౌతం బుద్ధనగర్ లో 144 సెక్షన్ విధించారు. మళ్లీ నాలుగో వేవ్ వస్తుందేమోనన్న అనుమానాలు కలుగుతుండడంతో అప్రమత్తమైన యోగి సర్కార్ మాస్కులు తప్పనిసరి చేసింది. 

 

 

ఇవి కూడా చదవండి

ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రశాంత్ కిషోర్

ముంబై - బెంగాల్ స్పైస్ జెట్ విమానంలో భారీ కుదుపులు

మందుల ధరలు 10 శాతం పెరిగే అవకాశం!

మైక్రో ఇన్సూరెన్స్ గరీబులకు వరం