కరోనా ఎఫెక్ట్: హైదరాబాద్ లో పలు ప్రాంతాలు మూసివేత

కరోనా ఎఫెక్ట్: హైదరాబాద్ లో పలు ప్రాంతాలు మూసివేత

హైదరాబాద్ లో కరోనా కేసులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. లాక్డౌన్ అమలులో ఉన్నప్పుడు వందలోపు ఉన్న కేసుల సంఖ్య.. అన్ లాక్ అవ్వగానే వందలలోకి చేరింది. రోజూ దాదాపు 500 నుంచి 900 కేసులు నమోదవుతున్నాయి. దాంతో నగర ప్రజలంతా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కేసుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని నగరంలోని కొన్ని ముఖ్యప్రాంతాలను మూసివేయాలని ఆ ప్రాంత అసోసియేషన్ నిర్ణయించింది. ఎప్పుడు కొనుగోలుదారులతో సందడిసందడిగా ఉండే సికింద్రాబాద్ జనరల్ బజార్ ను, ఆ పక్కనే ఉండే సూర్యా టవర్స్ ను, మరియు ప్యారడైజ్ సర్కిల్ ను మూసివేయాలని నిర్ణయించారు. ఈ మూసివేత వచ్చే నెల (జూలై) 5 వరకు అమలులో ఉంటుందని అసోసియేషన్ వర్గాలు తెలిపాయి.

For More News..

బలవంతంగా పురుగుల మందు తాగించి..

ఆర్బీఐ పరిధిలోకి కో-ఆపరేటివ్ బ్యాంకులు

న్యూజెర్సీలో కొత్త ఇంటి స్విమ్మింగ్ పూల్ లో పడి భారత కుటుంబం మృతి