ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా ట్రైనింగ్

ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా ట్రైనింగ్
  • సెల్ఫ్​ డిఫెన్స్​ ట్రైనింగ్​ తీసుకుంటున్న వారు పెరుగుతున్నరు

హైదరాబాద్, వెలుగు: అత్యాచారాలు, లైంగిక దాడి ఘటనలు పెరిగిపోవడంతో సిటీలోని బాలికలు, యువతులు సెల్ఫ్ డిఫెన్స్ కోర్సుల్లో చేరుతున్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదిరించి నిలబడేందుకు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేందకు ప్రయత్నిస్తున్నారు. పలు అకాడమీలతో పాటు ఆర్గనైజేషన్లు ఈ తరహా కోర్సులను అందిస్తున్నాయి. అకాడమీలలో నెలకి వెయ్యి రూపాయల నుంచి ఫీజులు ఉండగా, ఆర్గనైజేషన్లు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాయి. స్కూల్, కాలేజీ అమ్మాయిలకు, గృహిణులకు స్కూళ్లు, కమ్యూనిటీ హాళ్లు, అకాడమీలలో కరాటే, సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ ఇస్తున్నారు. 

టెక్నాలజీ పెరిగినా..

ఆత్మ విశ్వాసానికి మించిన ధైర్యం మరొకటి ఉండదు. అమ్మాయిలు ఒంటరిగా ఉద్యోగాలకు, స్కూళ్లకు, కాలేజీలకు, ఇతర పనుల మీద డైలీ బయటకు వెళ్లాల్సి ఉంటుంది. దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆ టైంలో తమను తాము రక్షించుకునేందుకు కనీస మెళకువలు తెలుసుకోవాలని భావిస్తున్నవారు ఎక్కవవుతున్నారు. ఈ సెల్ఫ్ డిఫెన్స్ క్లాసుల్లో శిక్షణతో పాటు మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్​గా ఉండేలా  మోటివేట్ చేస్తున్నట్లు ట్రైనర్లు చెబుతున్నారు. ఎంత టెక్నాలజీ వచ్చినా, ఎన్ని సేఫ్టీ యాప్స్ వచ్చినా సెల్ఫ్ డిఫెన్స్ చేయడం తెలిసినప్పుడే ధైర్యంగా ఉండగలుగుతారని అంటున్నారు.

స్కూళ్లు, కాలేజీల్లోనూ..

సిటీకి చెందిన పలు ఎన్జీవోలు సిటీలోని స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి మేనేజ్​మెంట్​తో మాట్లాడి ఒకటి, రెండ్రోజులపాటు సెల్ఫ్ డిఫెన్స్ సెషన్స్ నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా ముందుగా వామ్‌‌‌‌‌‌‌‌ అప్ సెషన్స్, ఎక్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైజ్ చేయించి ఆ తర్వాత ట్రైనర్లు శిక్షణ ఇస్తున్నారు.ఆపద సమయంలో ఎలా స్పందించాలి? ఎలా బయటపడాలి? అనే విషయాలను డెమో రూపంలో చేసి చూపిస్తున్నారు. ఒంటరిగా ప్రయాణిస్తున్న సమయంలో, వర్క్​ప్లేస్, ఇల్లు, స్కూల్ ఇలా ఎక్కడైనా ఎవరైనా ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే అప్పటికప్పుడు ధైర్యంగా ఎలా ఫేస్ చేయాలో ట్రైనప్ చేస్తున్నారు. కరోనా టైం నుంచి ట్రైనింగ్ వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులమంతా  కలిసి గ్రూపుగా ఏర్పాటయ్యాం. కరోనా టైంలో ఫ్రీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ట్రైనింగ్​ క్లాసులు మొదలుపెట్టాం. స్కూళ్లు, కాలేజీల్లోని అమ్మాయిల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుతున్నాం. సేఫ్టీ, సెల్ఫ్ డిఫెన్స్​పై అవగాహన కల్పిస్తున్నాం. బాలికలు, యువతులతోపాటు గృహిణులు పాల్గొంటున్నారు. మా గ్రూపులో అబ్బాయిలతోపాటు అమ్మాయిలు వలంటీర్లుగా పనిచేస్తున్నారు. విజయ్, వలంటీర్, ఐహోప్ టీమ్ మా అమ్మాయిని చేర్పించిన..ప్రస్తుతం ఆడపిల్లను బయటకు పంపాలంటే భయంగా ఉంటోంది. మా ఏరియాలో సెల్ఫ్ డిఫెన్స్ కోర్సు నేర్పిస్తున్నారని తెలిసి మా అమ్మాయిని చేర్పించాం. ఈ కోర్సుతో కాన్ఫిడెన్స్ పెరిగి ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోగలరని నమ్ముతున్నాం.–లావణ్య, మధురానగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌