Visveswara Rao: సీనియర్ హస్యనటుడు విశ్వేశ్వరరావు కన్నుమూత

Visveswara Rao: సీనియర్ హస్యనటుడు విశ్వేశ్వరరావు కన్నుమూత

చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. తెలుగు, తమిళ సినిమాల్లో తన నటనతో లక్షల మందిని నవ్వించిన సీనియర్ హస్యనటుడు విశ్వేశ్వర రావు(Visveswara Rao) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం(ఏప్రిల్ 2) ఉదయం కన్నుమూసినట్లు సమాచారం. అయన మృతి పట్ల అభిమానులు, ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. 

ఇక హాస్యనటులుల్ విశ్వేశ్వరరావు.. తెలుగు, తమిళ భాషల్లో 150 పైగా సినిమాల్లో నటించారు. కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా.. బుల్లితెరపై కూడా ప్రేక్షకులను అలరించారు. బుధవారం ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.