
పాకిస్తాన్ కాల్పుల్లో జమ్మూకశ్మీర్ ప్రభుత్వ అధికారి మృతి చెందారు. మే 10న ఉదయం రాజౌరీ దగ్గర ఆయన ఇంటిపై జరిగిన కాల్పుల్లో ప్రభుత్వ అధికారి రాజ్ కుమార్ తప్పా మరణించారు. అధికారి మృతిపట్ల ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారి మృతితో తనకు మాటలు రావడం లేవని,మరణానికి కొన్ని గంటల ముందే తనతో ఆన్‌లైన్ సమావేశానికి హాజరయ్యారని చెప్పారు.
జమ్మూ కశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్‌కు అంకితభావంతో పనిచేసే అధికారిని కోల్పోయాము. నిన్ననే ఆయన జిల్లాలో డిప్యూటీ సీఎంతో పాటు పర్యటించారు. నేను అధ్యక్షత వహించిన ఆన్‌లైన్ సమావేశానికి హాజరయ్యారు. ఈ రోజు ఆ అధికారి నివాసంపై పాక్ కాల్పులు జరిగాయి. వారు రాజౌరి పట్టణాన్ని లక్ష్యంగా చేసుకుని మా అదనపు జిల్లా అభివృద్ధి కమిషనర్ శ్రీ రాజ్ కుమార్ తప్పాను చంపారు. ఆయన మృతికి ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నా అని ఓమర్ అబ్దుల్లా తన ఎక్స్ లో పోస్ట్ చేశారు.
మరో వైపు భారత్ 3పాక్ వైమానిక స్థావరాలపై దాడి చేసి, డ్రోన్ లాంచ్ ప్యాడ్ సైట్లను ధ్వంసం చేసింది. ఈ దాడులను పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరిఫ్ చౌదురి ధ్రువీకరించారు. పాకిస్తాన్ డ్రోన్లను భారత్ ఎక్కడిక్కడ ధ్వంసం చేస్తోంది.