స్టాక్ మార్కెట్లో బుల్ రన్

స్టాక్ మార్కెట్లో బుల్ రన్

స్టాక్ మార్కెట్లు దూసుకుపోయాయి. అన్నీ సానుకూల సంకేతాలే ఉండటంతో భారీ లాభాలు మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ఉండటం, ఫారిన్ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడం, గత కొన్ని రోజులుగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న రూపాయి పుంజుకోవడం తదితర అంశాలు మార్కెట్ లో జోష్ నింపాయి. అమెరికా మానుఫ్యాక్చరింగ్ పీఎంఐ తగ్గడంతో యూఎస్ ఫెడ్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్లు పెంచకపోవచ్చన్న అంచనా కూడా బుల్ రన్కు కారణమైంది. 

ఉదయం 57,506.65 పాయింట్ల వద్ద ప్రారంభమైన మార్కెట్ లో ఆరంభ స్థాయే ఇవాళ్టి కనిష్ఠ స్థాయి. ఇంట్రాడే ట్రేడింగ్ లో 58,099.94పాయింట్ల గరిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. మార్కెట్ ముగిసే సమయానికి 1277పాయింట్ల లాభంతో 58,065 పాయింట్ల వద్ద క్లోజయింది. ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, హెచ్ డీఎఫ్ సీ, టాటా స్టీల్, విప్రో, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ షేర్లు భారీగా లాభపడ్డాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ సెప్టెంబర్ 23 తర్వాత మళ్లీ 17,200 మార్కు దాటింది. 387 పాయింట్ల ప్రాఫిట్ తో 17,274పాయింట్ల వద్ద ముగిసింది. దసరా సెలవు కారణంగా రేపు మార్కెట్లకు పనిచేయవు.