నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ ఫలితాలకు తోడు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం మార్కెట్కు ప్రతికూలంగా మారింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు, క్రూడాయిల్ ధరలు పెరగుతుండటం మార్కెట్లో ఊగిసలాటకు కారణమైంది. 

ఉదయం ట్రేడింగ్ లాభాలతో ప్రారంభమైనా.. నిమిషాల వ్యవధిలోనే మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. 58,217.69 పాయింట్ల వద్ద ప్రారంభమైన మార్కెట్ ఒక దశలో అమ్మకాల ఒత్తిడితో 57,635.43 పాయింట్ల కనిష్ఠ స్థాయికి పతనమైంది. ఆ తర్వాత కాస్త కోలుకుని 58,346 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకినా.. చివరకు నష్టాలు తప్పలేదు. ట్రేడింగ్ ముగిసే సమయానికి 104.67పాయింట్ల లాస్తో 57,892.01 వద్ద క్లోజయింది. ఇండెక్స్ లలో కొన్ని లాభపడగా.. మరికొన్ని నష్టాలు మూటగట్టుకున్నాయి. హెచ్డీఎఫ్సీ, రిలయన్స్, హిందుస్థాన్ లీవర్, పవర్ గ్రిడ్, ఎల్ అండ్ టీ సూచీలు ప్రాఫిట్ గెయిన్ చేయగా.. టాటా స్టీల్, ఎం అండ్ ఎం, ఎన్టీపీసీ, మారుతి, డాక్టర్ రెడ్డీస్ షేర్లు లాస్ అయ్యాయి. నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ.. నిఫ్టీ 17.60పాయింట్ల నష్టంతో 17,304.60 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తల కోసం..

రూ.100 కోట్లతో ఐటీ టవర్స్కు శంకుస్థాపన

టీ-20 సిరీస్ పై కన్నేసిన టీమిండియా