
- ఢిల్లీలో ప్రారంభించిన ప్రభుత్వం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకు కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే రెండు ప్రభుత్వాలు సంయుక్తంగా న్యూ కోవిడ్ – 19 రెస్పాన్స్ ప్లాన్‌ను ప్రిపేర్ చేశాయి. దాంట్లో భాగంగానే కరోనా వ్యాప్తిని కనిపెట్టేందుకు శనివారం నుంచి మమ్మూట్ క్యాంపైన్‌స్టార్ట్ చేశారు. సీరియోలాజికల్ టెస్ట్ లేదా సిరో సర్వేలైన్స్ స్టడీని ప్రారంభించారు. ఢిల్లీలో రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో కేసులు ముంబైని దాటిపోయాయి. 73,780 కేసులు ఉండగా.. 2,429 మంది చనిపోయారు. కాగా.. ఈ సర్వే ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారనే వివరాలు.
అసలు ఏంటీ సర్వే?
బాడీలోని ఇమ్యూనిటీ సిస్టమ్‌లో యాంటీ బాడీస్ క్రియేట్ అయితే.. ఈ టెస్ట్ ద్వారా కనిపెడతారు. ఎవరైనా వైరస్ బారిన పడితే వాళ్ల రక్తంలో యాంటిజెన్లు ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. అంటు వ్యాధులు, స్వయం ప్రతిరక్షక వ్యాధులను నిర్ధారించేందుకు ఈ టెస్టు చేస్తారు. ఒక వ్యక్తిలో రోగ నిరోధక శక్తి ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు కూడా దీన్ని ఉపయోగిస్తారు. “ సంక్రమణకు సంబంధించి సెరోప్రెవెన్స్ స్థాయిని బట్టి వ్యాధి నివారణ, నియంత్రణ కోసం చర్యలు తీసుకోవచ్చు. ప్రజారోగ్య ప్రణాళిక తయారు చేసి అమలు చేయొచ్చు” అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ అధికారి ఒకరు గతంలో చెప్పారు. ఈ మేరకు జూన్ 27 నుంచి ఢిల్లీలో ఈ సర్వే స్టార్ట్ చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. దీని కోసం స్పెషల్ టీమ్స్‌ను కూడా సిద్ధం చేశారు. వారికి ట్రైనింగ్ కూడా ఇచ్చారు.
సర్వే ఎవరు, ఎక్కడ చేస్తారు?
కేంద్రం హోం మినిస్ట్రీ కింద పనిచచే సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్, ఢిల్లీ గవర్నమెంట్ సంయుక్తంగా ఈ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వేలో యాంటీ బ్లెడ్ టెస్టులపై ఫోకస్ చేశారు. ఢిల్లీ పరిధిలోని 11 జిల్లాల్లో ర్యాండమ్ బేసిస్‌లో 20వేల గృహాలపై చేస్తారు. 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వ్యక్తులకు కూడా చేస్తారు.
ఈ టెస్టు ఎలా చేస్తారు?
సెరోలాజిలక్ సర్వేలో IgG ఎంజైమ్ లింక్ ఇమ్యునోసోర్బెంట్ అస్సే (ఈఎల్‌ఐఎస్‌ఏ) పరీక్ష ఉంటుంది. ఇది సార్స్ – కోవ్ – 2 (కరెనా వైరస్) సంక్రమణకు గురైన వారి నిష్పత్తిని అంచనా వేస్తుంది. తీవ్రమై అందువ్యాధులను గుర్తించేందుకు IgG పరీక్ష ఉపయోగపడు కానీ ఇది గతంలో సోకిన అంటువ్యాధుల గురించి సూచిస్తుంది. ఐసీఎమ్‌ఆర్ కూడా ఈ పరీక్షను ఆమోదించింది. ఈ పరీక్షలో ఐదు మిలీలీటర్ల రక్త నమూనాను సేకరిస్తారు. రక్తం, ప్లాస్మాను వేరుచేసే యంత్రంలో ఉంచుతారు. శరీరంలో కరోనాకు వ్యతిరేకంగా యాంటీ బాడీస్ డవలెప్ అయ్యాయనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్లాస్మ ఉపయోగపడుతుంది. ఐసీఎమ్‌ఆర్ మే నెలలో దీనికి సంబంధించి 21 రాష్ట్రాల్లోని 83 జిల్లాల్లో పైలెట్ సర్వే నిర్వహించింది.