నిజామాబాద్​ నేతల అభిమానానికి కృతజ్ఞుణ్ని : షబ్బీర్ ​అలీ

నిజామాబాద్​ నేతల అభిమానానికి కృతజ్ఞుణ్ని : షబ్బీర్ ​అలీ
  •     కామారెడ్డి వదిలి ఇక్కడికి వస్తున్నందుకు బాధగా ఉన్నా, మీ ఆప్యాయత ఆనందాన్ని కలిగిచింది
  •     మాజీ మంత్రి షబ్బీర్​ అలీ

కామారెడ్డి, వెలుగు: నిజామాబాద్​ కాంగ్రెస్ ​నేతల అభిమానానికి కృతజ్ఞుడినని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి షబ్బీర్ ​అలీ పేర్కొన్నారు. కామారెడ్డిని వదిలి నిజామాబాద్​కు వస్తున్నందుకు బాధగా ఉన్నా, మీ అభిమానం ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. ఆదివారం ఆయన కామారెడ్డికి సమీపంలో  ఉన్న రామయంపేట శివారులో తన ఫామ్ ​హౌజ్​లో   నిజామాబాద్​అర్బన్ ​నియోజకవర్గ ముఖ్య నేతలతో  సమావేశమయ్యారు.

నిజామాబాద్ అర్బన్​ నుంచి పోటీ చేయాలని అధిష్టానం సూచించిన నేపథ్యంలో ఆయనఈ మీటింగ్​ నిర్వహించారు. ఆత్మీయ సమ్మేళనంలో షబ్బీర్​అలీ మాట్లాడుతూ.. బీఆర్ఎస్​పదేండ్లుగా దొరల పాలన కొనసాగిస్తోందని విమర్శించారు. కాళేశ్వరం పేరుతో అధికార పార్టీ లక్ష కోట్లు దోచుకుందని మండిపడ్డారు. కాంగ్రెస్ ​పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీల స్కీమ్​లను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. 

షబ్బీర్​కు సంపూర్ణ మద్దతు..

నిజామాబాద్ అర్బన్​ టికెట్ ​కోసం 13 మంది అప్లయ్ ​చేసుకోగా, వారందరూ షబ్బీర్​అలీకి మద్దతు తెలిపారు. పార్టీ గెలుపే లక్ష్యంగా కలిసి పనిచేస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సుదర్శన్​రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్​ మానాల మోహన్​రెడ్డి, మాజీ మేయర్​ ధర్మపురి అర్వింద్, మాజీ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, అరికెల నర్సారెడ్డి, ముఖ్య లీడర్లు తాహెర్​బిన్ ​హందాన్, గడుగు గంగాధర్, నగేశ్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

ALSO READ :  దోచుకున్న డబ్బుతో ఓట్లు కొంటున్నరు : సీతక్క