
షారుఖ్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘జవాన్’. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాతోనే ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. సోమవారం తన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షారుఖ్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ‘తుఫాను ముందు వచ్చే ఉరుము ఆమె’ అనే క్యాప్షన్‌తో విడుదల చేసిన ఈ పోస్టర్‌లో.. బ్లాక్ సన్ గ్లాసెస్, చేతిలో గన్‌తో యాక్షన్ లుక్‌లో కనిపిస్తోంది నయనతార. ఆమె కొన్ని మేజర్ కిక్‌లు, పంచ్‌లు నేర్చుకుంది జాగ్రత్త అంటూ ఇటీవల నయన్ భర్త విఘ్నేష్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు షారుఖ్. అందుకు తగ్గట్టే డేరింగ్ అండ్ డ్యాషింగ్ కాప్ గెటప్‌లో కనిపిస్తోంది నయనతార. సెప్టెంబర్ 7న సినిమా విడుదల చేయబోతున్నట్టు కూడా అప్ డేట్ ఇచ్చారు షారుఖ్. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదల కానుంది. షారుఖ్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు.
ALSO READ :ఉమ్మడి ఖమ్మంలోని 10 స్థానాలు మావే : సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క