Pathaan 2: షారుఖ్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. పఠాన్ 2 నుండి క్రేజీ అప్డేట్!

Pathaan 2: షారుఖ్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. పఠాన్ 2 నుండి క్రేజీ అప్డేట్!

పఠాన్(Pathaan).. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shahrukh khan) కు చాలా రోజుల తరువాత వచ్చిన బ్లాక్ బస్టర్. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. చాలా కాలంగా సరైన హిట్టు లేక నిరాశలో ఉన్న షారుఖ్ ఫ్యాన్స్ ఈ సినిమా అందించిన విజయంతో కాలర్ ఎగరేసారు. యాష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ సినిమాను దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కించారు. 

స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా భారీ విజయం సాధించిన క్రమంలో ఈ సినిమాకు సీక్వెల్ గా పఠాన్ 2ను కూడా ప్రకటించారు మేకర్స్. ఇక అప్పటినుండి పఠాన్ 2 అప్డేట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు షారుఖ్ ఫ్యాన్స్. ఈ క్రమంలోనే పఠాన్ 2 గురించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. పఠాన్ సీక్వెల్ కోసం దాదాపు పార్ట్ 1కి పనిచేసినవారీనే ఫిక్స్ చేయనున్నారట మేకర్స్. హీరోయిన్ కూడా దీపికా పదుకొనె ఉంటారని టాక్. అయితే దర్శకుడి విషయంలో మాత్రం మార్పు చేయాలని చూస్తున్నారట. 

ALSO READ | Thalapathy Vijay, Trisha: విజయ్, త్రిష.. సౌత్లో ఈ ఇద్దరికే టాప్ రెమ్యునరేషన్.. ఎన్ని కొట్లో తెలుసా?

పఠాన్ సినిమాను స్టార్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. కానీ, సీక్వెల్ కోసం మాత్రం కొత్త దర్శకుడు పని చేయనున్నాడట. అయితే ఆ దర్శకుడు ఎవరు అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఇంతకు ముందు వార్ సీక్వెల్ విషయంలో కూడా దర్శకుడిని మార్చారు యాష్ రాజ్ సంస్థ. ఇప్పుడు పఠాన్ సీక్వెల్ కోసం కూడా అదే ప్లాన్ ను వర్కౌట్ చేస్తున్నారు. మరి ఈ మార్పు ఈ రెండు సీక్వెల్స్ పై ఎలాంటి  ప్రభావాన్ని చూపిస్తాయో చూడాలి.