మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ఇందులో ప్రభాస్, కాజల్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్ లాంటి స్టార్స్ కీలకపాత్రలు పోషిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఒక్కొక్కరి పాత్రలను పరిచయం చేస్తున్న టీమ్.. ఆదివారం శరత్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన క్యారెక్టర్‌ను రివీల్ చేశారు. ఇందులో నాథనాధుడిగా ఆయన నటించారని ప్రకటించారు.
ఓ యోధుడి గెటప్‌లో రిలీజ్ చేసిన శరత్ కుమార్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ‘మహాభారతం’ టీవీ సిరీస్‍ను తెరకెక్కించిన ముకేశ్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా మోహన్ బాబు నిర్మిస్తున్నారు. బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్, దేవరాజ్, ఐశ్వర్య, ముకేశ్ రుషి ఇతర పాత్రలు పోషిస్తున్నారు. స్టీఫెన్ దేవస్సీ సంగీతాన్ని అందిస్తున్నారు. విజువల్ ట్రీట్ ఇచ్చేలా, ఇండియన్ స్క్రీన్ మీద మునుపెన్నడూ చూడనటువంటి గ్రాండియర్‌తో కన్నప్ప చిత్రం రానుందని మంచు విష్ణు అన్నాడు. డిసెంబర్‌లో సినిమాలో విడుదలకు ప్లాన్ చేస్తున్నామన్నారు.