బంధాలు, విలువలను చాటే షష్టిపూర్తి

 బంధాలు, విలువలను చాటే  షష్టిపూర్తి

రూపేష్ చౌదరి హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘షష్టిపూర్తి’. పవన్ ప్రభ దర్శకుడు. ఒకప్పుడు ‘లేడీస్ టైలర్’తో ఆకట్టుకున్న  రాజేంద్ర ప్రసాద్, అర్చన  జంట ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఆకాంక్షా సింగ్ హీరోయిన్. ఈ మూవీ ఫస్ట్ లుక్‌‌ పోస్టర్‌‌‌‌ను అనిల్‌‌ రావిపూడి విడుదల చేసి, ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఈ సందర్భంగా రూపేష్ మాట్లాడుతూ ‘కుటుంబ బంధాలు, విలువల నేపథ్యంలో దీన్ని తెరకెక్కిస్తున్నాం. ఇళయరాజా, తోట తరణి లాంటి సీనియర్స్‌‌తో వర్క్ చేయడం సంతోషంగా ఉంది.

ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. త్వరలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నాం’ అని చెప్పాడు. దర్శకుడు మాట్లాడుతూ ‘పిల్లలు తమ తల్లిదండ్రుల పెళ్లి చూడలేరు. షష్టిపూర్తి ద్వారా ఆ లోటు తీర్చుకునే అవకాశాన్ని భగవంతుడు కల్పించాడు. ఆ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. రాజేంద్ర ప్రసాద్, అర్చన జంట ముప్ఫై ఏళ్ళ క్రితం ఎలా ఉండేవారో అలాంటి ఓ రెట్రో ఎపిసోడ్ తీశాం’ అని చెప్పాడు.