పెగాసస్‌కు ఎవరు ఫండింగ్ చేశారో తేలాలి

పెగాసస్‌కు ఎవరు ఫండింగ్ చేశారో తేలాలి

ముంబై: దేశ రాజకీయాల్లో పెగాసస్ స్పైవేర్ అంశం చర్చనీయాంశంగా మారింది. పలువురు కేంద్ర మంత్రులతోపాటు విపక్ష నేతలు, ప్రముఖ జర్నలిస్టులు, వ్యాపారవేత్తలు మొబైల్ ఫోన్లు హ్యాక్‌కు గురయ్యాయన్న వార్తలు సంచలనంగా మారాయి. ఈ విషయంపై కేంద్రాన్ని టార్గెట్‌గా చేసుకుని విపక్షాలు విమర్శలకు దిగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లోనూ ఇదే విషయమై సభను ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. ఈ విషయంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. ఫోన్ల హ్యాకింగ్‌ కోసం  పెగాసస్‌కు ఎవరు ఫండింగ్ చేశారో కనిపెట్టాలని సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. 

‘దేశంలోని రాజకీయ నేతలు, మానవ హక్కుల కార్యకర్తలు, ఇద్దరు కేంద్ర మంత్రులు, 30 మంది జర్నలిస్టులతోపాటు 1,500 మందిపై పెగాసస్ యాప్‌ను స్పైయింగ్ కోసం వినియోగించారు. ఓ రిపోర్టు ప్రకారం.. ఒక లైసెన్స్‌తో 50 మంది ఫోన్లను హ్యాక్ చేశారు. అందుకు 8 మిలియన్ డాలర్లు చెల్లించారు. ఒక్క 2019లోనే 300 ఫోన్ల స్పైయింగ్ కోసం 48 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. ఇలా చూస్కుంటే.. 2020, 2021లో ఇంకా ఎక్కువే ఖర్చు చేసి ఉంటారు. ఎవరి జేబుల్లో నుంచి ఈ డబ్బులు వెళ్లాయనేది తేలాలి. దీనిపై విచారణ జరుపుతారా?’ అని శివసేన అధికార పత్రిక సామ్నా వీక్లీ కాలమ్ రోఖ్‌తోఖ్‌లో సంజయ్  రౌత్ ప్రశ్నించారు.