మేడిపల్లి స్వాతి కేసులో సంచలన విషయాలు..

మేడిపల్లి స్వాతి కేసులో సంచలన విషయాలు..

హైదరాబాద్ లో సంచలనం రేపిన మేడిపల్లి స్వాతి హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. శనివారం ( ఆగస్టు 23 ) రాత్రి జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు స్థానికులు. ఈ కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.. భార్య స్వాతిని చంపి ముక్కలు చేయాలని ముందుగానే ప్లాన్ చేసిన మహేందర్ రెడ్డి యాక్సా బ్లేడ్ ముందే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

స్థానికంగా కాల్ సెంటర్ లో టెలీకాలర్ గా పని చేస్తున్న స్వాతి ఎక్కువగా కాల్స్ మాట్లాడుతోందని అనుమానం పెంచుకున్నాడు మహేందర్ రెడ్డి. ఈ విషయంలో తరచూ గొడవ జరిగేదని తెలుస్తోంది. ఈ క్రమంలో శనివారం రాత్రి కూడా మహేందర్ రెడ్డి, స్వాతి మధ్య గొడవ జరిగింది. దీంతో మహేందర్ రెడ్డి స్వాతి గొంతు నులిమి చంపేశాడు.

ఆ తర్వాత యాక్సా బ్లేడుతో స్వాతి శరీరాన్ని ముక్కలు చేశాడు మహేందర్ రెడ్డి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మహేందర్ రెడ్డి స్వాతిని ప్రేమించినప్పటికీ పెళ్లి ఇష్టం లేదని తెలుస్తోంది. ప్రేమ వ్యవహారం బయటపడటంతో ఒప్పించి పెళ్లి చేశారు పెద్దలు. అప్పటి నుంచి అయిష్టంగా భార్యతో ఉంటున్న మహేందర్ రెడ్డి.. ఆమెను కడతేర్చాలని ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ప్లాన్ ప్రకారమే ఆమెను చంపేశాడని స్వాతి బంధువులు చెబుతున్నారు. 

Also read:-మేడిపల్లి హత్య కేసు..ఎవరు కాల్ చేసినా అనుమానించేవాడు..స్వాతి చిన్నమ్మ

స్వాతితో ఉండటం ఇష్టం లేకపోయినా జీవనం సాగిస్తున్నాడు. ఈ విషయంలో కుటుంబ సభ్యులు సర్ధి చెప్పారు.  వివాహం అయిన నాలుగు నెలలకే భార్య స్వాతి గర్భవతి అయ్యింది. ఇష్టం లేని భర్త మహేందర్.. అబార్షన్ చేయించాడు.

ఆదివారం భార్య స్వాతిని చంపిన మహేందర్.. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. మొండెం ఒక్కటే ఉండటంపై పోలీసులు ప్రశ్నించగా.. కాళ్లు, చేతులు, తల సమీపంలోని ప్రతాప సింగారం దగ్గర మూసీలో పడేసినట్లు తెలిపాడు. క్లూస్ టీమ్స్, ఫోరెన్సిక్, డాగ్ స్కాడ్ , DRF బృందాలతో మృతదేహం కోసం గాలిస్తున్నారు.