టెక్నాలజీ.. క్రేజీ అప్​డేట్స్

టెక్నాలజీ.. క్రేజీ అప్​డేట్స్

వాట్సాప్​లో స్పామ్ కాల్స్ వస్తున్నాయా? డోంట్​ వర్రీ... అవి రాకుండా ఉండాలంటే సైలెంట్​లో పెట్టేస్తే సరి. ఇంట్లో పాత ఫోన్, ఫ్రిజ్​, టీవీలు వంటివి ఏమైనా ఉంటే తొందరపడి పడేయకండి. ఎందుకంటే ఫ్లిప్​కార్ట్​లో వాటిని ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు తెలుసా. యూట్యూబ్​లో యాడ్​ బ్లాకర్స్ విపరీతంగా వాడుతున్నారా? అయితే యూట్యూబ్ మిమ్మల్ని  బ్లాక్ చేసే ఛాన్స్​ ఉంది జాగ్రత్త. 

స్పామ్​ కాల్స్​ని సైలెంట్​లో పెట్టొచ్చు

 

వాట్సాప్‌‌లో అప్పుడప్పుడు తెలియని నెంబర్ల నుంచి స్పామ్ కాల్స్ వస్తుంటాయి. అయితే వాట్సాప్ ఇప్పుడు దీని కోసం కూడా కొత్త ఫీచర్‌‌ను తెచ్చేసింది. తెలియని నెంబర్ల నుంచి వచ్చే స్పామ్ కాల్స్‌‌ను సైలెన్స్ చేయవచ్చు. ఆండ్రాయిడ్, ఐవోఎస్ వాడేవాళ్లందరికీ ఈ ఫీచర్​ అందుబాటులో ఉంది. వాట్సాప్ కాల్ సైలెన్స్ అయినా హిస్టరీలో కాల్స్ కనిపిస్తాయి. కానీ రింగ్ మాత్రం కావు. వాట్సాప్ ఓపెన్ చేసి ‘సెట్టింగ్స్‌‌’లోకి వెళ్లాలి. అందులో కనిపించే ‘ప్రైవసీ’ ఆప్షన్‌‌ ఎంచుకోవాలి.ప్రైవసీ’లో ‘కాల్స్’ సెలక్ట్ చేయాలి.తర్వాత ‘సైలెన్స్ అన్​నోన్ కాల్స్’ (Silence Unknown Calls)ను ఎనేబుల్ చేయాలి. ఒకవేళ కొత్త నెంబర్ నుంచి వచ్చే కాల్స్​ లిఫ్ట్​ చేయాలనుకుంటే దాన్ని డిజేబుల్ చేస్తే సరి.