నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

చెరువులు కబ్జా అవుతున్నా పట్టించుకోరా?

డిచ్​పల్లి, వెలుగు: మండలంలో చెరువులు కబ్జా అవుతున్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని మండల సర్పంచులు, ఎంపీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఎంపీపీ భూమన్న అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సభ్యులు వెలుగు లో వచ్చిన ‘చెరువుల్లోనే వెంచర్లు’ అనే కథనాన్ని ఉదహరిస్తూ కబ్జాలపై ఆఫీసర్లను నిలదీశారు. రెవెన్యూ ఆఫీసర్ల సహకారంతోనే అక్రమ వెంచర్లు పుట్టుకోస్తున్నాయని ఆరోపించారు.  ప్రతి మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సమస్యలు చెప్పుకుంటున్న పరిష్కారానికి నోచుకోవడంలేదని ఆసహనం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వహిస్తున్న ఆఫీసర్లపై కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేయాలని సభ్యలు తీర్మానించారు. 

ఉపాధి కోసం వెళ్లిన వ్యక్తి మాయం

మాక్లూర్, వెలుగు: ఉపాధి కోసం గల్ఫ్ దేశం వెళ్లిన వ్యక్తి జాడ తెలియడం లేదు. మాక్లూర్ మండల కేంద్రానికి చెందిన మేకల సాయిలు (35) రెండు నెలల కింద జిల్లా కేంద్రానికి చెందిన ఒక గల్ఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌​ఏజెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి దుబాయి వెళ్లేందుకు రూ.72 వేలు చెల్లించాడు. ఏజెంట్​రమ్మన్నాడని ఇంట్లో చెప్పి వెళ్లాడు. జులై 6న దుబాయి వెళ్లేందుకు చెన్నై నుంచి మలేషియా ప్లైట్​ ఎక్కినట్లు భార్య సుజాతకు ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. తెల్లారి నుంచి సాయిలు ఫోన్ పని చేయడం లేదు. ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నది..   తెలియలేదు. దీంతో కుటుంబీకులు ఆందోళన చెంది స్థానిక పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 
ఫిర్యాదు చేశారు.  

హర్ ఘర్ తిరంగాను సక్సెస్​ చేయండి
నిజామాబాద్,  వెలుగు: జిల్లాలో నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా ప్రొగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సక్సెస్ చేయాలని బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ధన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. ఇందూరు నగరంలోని మార్వాడి గల్లీలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాది కా అమృత్ మహోత్సవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పంద్రాగస్టు నాడు ప్రతి ఇంటిపై జాతీయ జెండాలను ఎగురవేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో బీజేపి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్ లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు నాగోళ్ల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్ మాస్టర్ శంకర్, బీజేపీ నాయకులు పంచరెడ్డి లింగం, బూరుగుల వినోద్, బొబ్బిలి వేణు, రోషన్ లాల్, కైసర్, పోలీస్ శ్రీనివాస్, మఠం పవన్, బట్టికరి ఆనంద్ పాల్గొన్నారు. 

దెబ్బతిన్న రోడ్లకు రిపేర్లు చేయాలి
కామారెడ్డి, వెలుగు: వానలకు దెబ్బతిన్న రోడ్లకు సంబంధిత శాఖల ఆఫీసర్లు వెంటనే రిపేర్లు చేపట్టాలని  కామారెడ్డి జడ్పీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ దఫేదర్ శోభ ఆఫీసర్లకు సూచించారు. గ్రామీణ అభివృద్ధి, విద్య, వైద్యం ఆంశాలపై  బుధవారం జరిగిన జడ్పీ స్థాయి సంఘాల సమావేశాల్లో మాట్లాడారు. రోడ్లకు రిపేర్లు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. సీజనల్​వ్యాధులపై అలర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉండాలన్నారు. అంతకుముందు జడ్పీలో మొక్కలు నాటారు. సీఈవో సాయాగౌడ్, జడ్పీటీసీలు చందన, మోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, మనోహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, అనిత,  ఆఫీసర్లు పాల్గొన్నారు.

స్టూడెంట్లకు హెల్త్ క్యాంప్
నిజామాబాద్, వెలుగు: వజ్రోత్సవాల సందర్భంగా మోపాల్ మండల కేంద్రంలోని కస్తూర్భా బాలికల పాఠశాలలో బుధవారం ప్రముఖ స్కిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పెషలిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాక్టర్ మధుకర్, డెంటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్.సందీప్ ఆధ్వర్యంలో ఫ్రీ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా స్టూడెంట్లకు ఉచిత వైద్య సేవలు అందించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో  ప్రిన్సిపాల్, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

22న ధరణి టౌన్ ఫిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్లాట్ల వేలం
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని రాజీవ్​స్వగృహ ( ధరణి టౌన్ షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)లో మిలిగి ఉన్న ప్లాట్లు, వివిధ స్టేజీల్లో ఉన్న ఇండ్లకు ఈ నెల 22న వేలం నిర్వహించనున్నట్లు కలెక్టర్​జితేష్ వి పాటిల్​చెప్పారు. బుధవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వేలంపై జరిగిన మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడుతూ రూ.10 వేలు చెల్లించి వేలంలో పాల్గొనవచ్చన్నారు.   

పోడు భూములకు పట్టాలియ్యాలె
సిరికొండ, వెలుగు: పోడు భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా నాయకులు  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం తహసీల్దార్ గఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మియాకు మెమోరండం అందజేశారు. అనంతరం ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి  రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాలోని సిరికొండ మండలంలోని గడ్కోల్, కొండాపూర్, తూంపల్లి, హుస్సేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇందల్వాయి మండలంలోని అన్సాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, భీంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలంలోని రైతులకు పట్టాలు ఉన్నా ఫారెస్టు ఆఫీసర్లు సాగు చేయనీయడం లేదన్నారు. కోర్టు ఇచ్చిన తీర్పును ఫారెస్టు ఆఫీసర్లు బేఖాతర్ చేస్తున్నారని ఆరోపించారు. దశాబ్దాల నుంచి కబ్జాలో ఉన్న పోడు భూములకు పట్టాలిచ్చి న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాజేశ్వర్, సాయిరెడ్డి పాల్గొన్నారు. 

రేపు దివ్యాంగుల వైద్య శిబిరం
బాన్సువాడ, వెలుగు: బాన్సువాడ ఎంపీడీవో ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ నెల 12న దివ్యాంగుల వైద్య శిబిరం  నిర్వహించనున్నట్లు మున్సిపల్ చైర్మన్ గంగాధర్ చెప్పారు. బుధవారం మున్సిపల్ ఆఫీసులో కమిషనర్ రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి కౌన్సిలర్లకు వైద్య శిబిరం గురించి వివరించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే ఈ శిబిరంలో దివ్యాంగులకు టెస్టులు చేసి వారికి అవసరమైన పరికరాలు అందజేస్తారని తెలిపారు. ఈ శిబిరానికి వచ్చే వారు సదరం సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ఆధార్, రేషన్ కార్డు తేవాలన్నారు.