2 లక్షల బుకింగ్స్.. రైల్వేకి రూ.45.30 కోట్ల ఆదాయం

2 లక్షల బుకింగ్స్.. రైల్వేకి రూ.45.30 కోట్ల ఆదాయం

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా ట్రైన్లను నిలిపేసిన రైల్వే శాఖ ఈ నెల 12 నుంచి ఢిల్లీ నుంచి 15 చోట్లకు స్పెషల్‌ ట్రైన్స్‌ నడుపుతోంది. ఈ నేపథ్యంలో ఆ ట్రైన్లలో ఇప్పటి వరకు 2,34,400 మంది ప్యాసింజర్లు టికెట్లను బుక్‌ చేసుకున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ప్యాసింజర్‌‌ రిజర్వేషన్‌ సిస్టమ్‌ (పీఆర్‌‌ఎస్‌) ద్వారా రూ.45.30 కోట్ల రూపాయలు వచ్చాయని ప్రకటించింది. కాగా జూన్‌ 30 వరకు బుక్‌ చేసుకున్న అన్ని మామూలు ప్యాసింజర్‌‌ రైల్వే టికెట్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. శ్రామిక్‌ రైళ్లు, స్పెషల్‌ ట్రైన్స్‌ను నడుపుతామని చెప్పింది. అంతే కాకుండా ఈ నెల 13 తర్వాత స్పెషల్‌ ట్రైన్స్‌లో టికెట్‌ బుక్‌ చేసుకున్న ప్రతి ఒక్కరు తమ వెళ్లే ప్లేస్‌కు సంబంధించిన పూర్తి అడ్రస్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రయాణికులను గుర్తించేందుకు ఇది ఉపయోగపతుందని ఈ నిర్ణయం తీసుకున్నారు.