KKR vs RR: శ్రేయాస్ అయ్యర్‌కు షాక్.. 12 లక్షల జరిమానా

KKR vs RR: శ్రేయాస్ అయ్యర్‌కు షాక్.. 12 లక్షల జరిమానా

ఐపీఎల్ లో భాగంగా నిన్న (ఏప్రిల్ 16) రాజస్థాన్ రాయల్స్, కోల్‌‌‌‌కతా నైట్‌‌‌‌ రైడర్స్‌‌‌‌ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులను కిక్ ఇచ్చింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో చివరి బంతికి రాజస్థాన్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత కేకేఆర్ 20 ఓవర్లలో 223/6 స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ స్టార్ జోస్ బట్లర్  (60 బాల్స్‌‌‌‌లో 9 ఫోర్లు, 6 ఫోర్లతో 107 నాటౌట్‌‌‌‌) సెంచరీతో జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. 

ఈ ఓటమి బాధలో కోల్‌‌‌‌కతా నైట్‌‌‌‌ రైడర్స్‌‌‌‌ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కొనసాగించినందుకు రూ.12 లక్షల జరిమానా విధించారు. కనీస ఓవర్ రేట్ ప్రకారం.. రాజస్థాన్ జట్టు ఒక ఓవర్ ఆలస్యంగా వేసింది. దీంతో అతనికి జరిమానా విధించారు. ఐపిఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం.. ఈ సీజన్‌లో అతని జట్టుకు ఇదే మొదటి నేరం కావడంతో అయ్యర్ కు రూ. 12 లక్షల జరిమానా విధించబడింది. జట్టులోని ఇతర ఆటగాళ్లకు ఎలాంటి జరిమానా విధించబడలేదు.

Also Read : టీ20 వరల్డ్ కప్.. ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ

ఈ టోర్నీలో ఇప్పటివరకు గిల్, రిషబ్ పంత్, సంజు శాంసన్  స్లో ఓవర్ రేట్  కారణంగా బీసీసీఐ కొరడా ఝళిపించింది. గుజరాత్ కెప్టెన్ శుభమాన్ గిల్ తొలిసారి ఈ సీజన్ లో స్లో ఓవరేట్ విధించారు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కు ఏకంగా రెండు సార్లు ఈ జరిమానా విధించబడింది. వరుసగా రెండో సారి స్లో ఓవరేట్ కారణంగా కెప్టెన్ తో పాటు ఆటగాళ్లకు కూడా జరిమానా విధించారు. మరోసారి స్లో ఓవరేట్ కొనసాగిస్తే.. ఒక మ్యాచ్ నిషేధం పడుతుంది.