Cricket World Cup 2023: వరల్డ్ కప్ తొలి మ్యాచులోనే టీమిండియాకు బ్యాడ్ న్యూస్ .. అనారోగ్యంతో శుభమన్ గిల్ ఔట్..?

Cricket World Cup 2023: వరల్డ్ కప్ తొలి మ్యాచులోనే టీమిండియాకు బ్యాడ్ న్యూస్ .. అనారోగ్యంతో  శుభమన్ గిల్ ఔట్..?

వరల్డ్ కప్ టోర్నీని గ్రాండ్ గా ఆరంభించాలనుకున్న టీమిండియాకు ఆరంభ మ్యాచులోనే బిగ్ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ శుభమన్ గిల్ ఆస్ట్రేలియాతో జరిగే తొలి మ్యాచుకు అనారోగ్యం కారణంగా దూరమయ్యాడు. గత కొన్ని రోజులుగా గిల్ డెంగ్యూ జ్వరంతో ఇబ్బంది పడుతున్నాడు. ఆదివారం మ్యాచ్ కావడంతో గిల్ ఇంకా కోలుకోలేదని తెలుస్తుంది. దీంతో గిల్ లేకుండానే టీమిండియా వరల్డ్ కప్ తొలి మ్యాచ్ ఆడబోతుంది. 

చెన్నై చేరుకున్నప్పటి నుండి గిల్ తీవ్ర జ్వరంతో ఇబ్బందిపడుతున్నాడు. ఆసీస్ మ్యాచుకు దూరమైన గిల్.. వరల్డ్ కప్ లో భారత్  తర్వాత ఆడబోయే మ్యాచులకు కూడా దూరమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం గిల్ వన్డేలో అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో రెండవ స్థానంలో ఉన్నాడు. గిల్ ఫామ్ ని చూసి వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేస్తాడని ఇప్పటికే చాలా మంది క్రికెట్ విశ్లేషకులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో గిల్ లేకపోవడం భారత్ కి గట్టి ఎదరు దెబ్బే అని చెప్పాలి.

 
కాగా.. గిల్ తొలి మ్యాచుకు దూరం కావడంతో ఇషాన్ కిషాన్, రాహుల్ లలో ఒకరు రోహిత్ తో కలిసి ఓపెనింగ్ చేస్తారు. రాహుల్ మిడిల్ ఆర్డర్ లో కీలక ఇన్నింగ్స్ లు ఆడుతున్నాడు కాబట్టి కిషాన్ కే ఓపెనింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఇరు జట్ల మధ్య చెన్నైలోని చిదంబరం స్టేడియంలో అక్టోబర్ 8 న మ్యాచ్ జరగనుంది.