Siddu Jonnalagadda: రెండేళ్ల క్రితం చెప్పాడు.. చేసి చూపించాడు.. వందకోట్లు కొల్లగొట్టిన టిల్లు

Siddu Jonnalagadda: రెండేళ్ల క్రితం చెప్పాడు.. చేసి చూపించాడు.. వందకోట్లు కొల్లగొట్టిన టిల్లు

స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda), మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) జంటగా వచ్చిన లేటెస్ట్ మూవీ టిల్లు స్క్వేర్. డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా మార్చి 29న విడుదలై భారీ విజయం సాధించింది. దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 

మొదటి రోజే రూ.28 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి అదిరిపోయే ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా.. కేవలం పదిరోజుల్లోనే రూ.100 కోట్లు రాబట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. చిత్ర నిర్మాత నాగవంశీ రిలీజ్ కి ముందే రూ.100 కోట్లు సాధిస్తాం అని చెప్పారు. అన్నట్టుగానే కేవలం పదిరోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది ఈ మూవీ. దీంతో ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్రాఫిట్స్ అందుకోనున్నారు మేకర్స్. 

ఇక.. టిల్లు స్క్వేర్ రూ.101.4 కోట్ల వసూళ్లు సాధించిన విషయాని అధికారికంగా ప్రకటిస్తూ.. మరో ఆసక్తికర విషయాన్ని కూడా తెలిపారు. అదేంటంటే.. రెండేళ్ల క్రితమే ఓ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. రాబోయే మూడేళ్ళలో రూ.100 కోట్ల స్టార్ అవ్వాలి అని చెప్పాడు సిద్ధూ. ఇప్పుడు అదే విషయాన్ని షేర్ చేస్తూ.. సిద్ధూ చెప్పి మరీ రూ.100 కోట్లు సాధించాడు అని ప్రకటించారు. దీంతో హీరో సిద్దు జొన్నలగడ్డకు సోషల్ మీడియాలో ప్రశంసలు దక్కుతున్నాయి.