పంజాబ్ లో కాంగ్రెస్ ఓటమి కి కారణం సిద్దూ

పంజాబ్ లో కాంగ్రెస్ ఓటమి కి కారణం సిద్దూ

పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత సిద్దూనే కారణమని ఆ పార్టీఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. సిద్దూని ముందే కంట్రోల్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఐదు రాష్ట్రాలలో అభివృద్ధి ప్రాతిపదిక మీద ఎన్నికలు జరగలేదని, మత రాజకీయాలపై జరిగాయన్నారు. ఏది ఏమైనప్పటికీ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సమీక్షించుకుంటామన్నారు. పాకిస్థాన్ ఆర్మీ ఛీఫ్ ను సిద్దూ కలవడం పెద్ద మైనస్ అయిందన్నారు. యూపీలో 80–20 అనే మతతత్వ వాదన తెచ్చారు. అందుకే అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయిందన్నారు. 
ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణ పై ఉండదు
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణపై ఉండదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో గెలిచాం కదా అని గుర్తు చేశారు. తాజా ఎన్నికల ఫలితాలపై సోనియా గాంధీతో చర్చించి .. భవిష్యత్తు కార్యచరణ చేపడతామన్నారు. ఈ ఫలితాల వల్ల క్యాడర్ డీలా పడే అవకాశం లేదన్నారు. గతంలో 24 సీట్లకు పరిమితమైన తర్వాత పదేళ్లు అధికారంలోకి వచ్చామని ఆయన గుర్తు చేశారు. 
త్వరలో రాష్ట్ర పార్టీలో కొత్త కమిటీ రాబోతుంది
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టేందుకు బలమైన నాయకులతో కమిటీ ఏర్పాటు చేయబోతున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. త్వరలో రాష్ట్ర పార్టీలో కొత్త కమిటీ రాబోతుందన్నారు. మంత్రి కేటీఆర్ ఈ రోజు సభలో కాంగ్రెస్ పార్టీ గురించి ఎగతాళి గా మాట్లాడారు, కాంగ్రెస్ నాయకులను కోచింగ్ సెంటర్లు పెట్టుకోమని సలహాలు ఇస్తున్నారు. కేసీఆర్ టీవీల ముందు కూర్చొండి అంటే.. బిశ్వాల్ కమిటీ ప్రకారం అన్ని భర్తీ చేస్తారనుకున్నాం, అలాగే 40 లక్షల మంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తారనుకున్నాం.. కానీ అలాంటివేమీ ఇవ్వలేదు, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కోచింగ్ సెంటర్లతోపాటు స్టడీ మెటీరియల్స్ ను అందించి ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. 

 

 

ఇవి కూడా చదవండి

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ అప్‎డేట్స్

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్ అప్‎డేట్స్