ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు

 ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన  సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని  రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ముట్టడించారు . సింగరేణిలో అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచాలని ఫిబ్రవరి 9న యాజమాన్యం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 9నుంచి కాంట్రాక్ట్ కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్నారు. సమ్మెలో భాగంగా ఇవాళ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును కార్మికులు ముట్టించారు. వెంటనే యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.