కొత్తగూడెంలో సింగరేణి మెయిన్ హాస్పిటల్ఎదుట నిరసన

కొత్తగూడెంలో సింగరేణి మెయిన్ హాస్పిటల్ఎదుట నిరసన

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెంలోని సింగరేణి మెయిన్​హాస్పిటల్​ ఎదుట సింగరేణి కాలరీస్​ వర్కర్స్​ యూనియన్​ ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్​ ప్రధాన కార్యదర్శి కె. రాజ్​కుమార్​మాట్లాడుతూ మెయిన్​ హాస్పిటల్​తో పాటు అన్ని ఏరియా హాస్పిటళ్లలో పేషెంట్లకు కావాల్సిన మందులు అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాలన్నారు. రిటైర్డ్​​ కార్మికులకు రెండు నెలలకు అవసరమైన మందులను అందజేయాలని కోరారు. ఈ ప్రోగ్రాంలో యూనియన్​ నేతలు వంగా వెంకట్, ఎస్​వీ. రమణ మూర్తి, క్రిష్టఫర్, అనంతలక్ష్మి, సుష్మసిరి, రమేశ్, నితిన్, రాంశంకర్, నాగయ్య పాల్గొన్నారు.