మదర్స్ డే సర్ ప్రైజ్ : తల్లి వేషంలో స్కూల్ కు వెళ్లిన తండ్రి

మదర్స్ డే సర్ ప్రైజ్ : తల్లి వేషంలో స్కూల్ కు వెళ్లిన తండ్రి

తల్లి ప్రేమకు తన పిల్లలు దూరం కాకూడదనే ఉద్దేశ్యంతో ఓ తండ్రి చేసిన పని ప్రస్తుతం పలువురి ప్రశంసలు పొందుతోంది. మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని  స్కూల్లో నిర్వహించిన కార్యక్రమానికి ఓ తండ్రి  మహిళ ( తల్లి) వేషధారణలో వెళ్లి చిన్నారి కోరికను తీర్చాడు.  

తల్లి ప్రేమకు తన పిల్లలు దూరం కాకూడదనే ఉద్దేశ్యంతో ఓ తండ్రి చేసిన పని ప్రస్తుతం పలువురి ప్రశంసలు పొందుతోంది. మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని  స్కూల్లో నిర్వహించిన కార్యక్రమానికి ఓ తండ్రి  మహిళ వేషధారణలో వెళ్లి చిన్నారి కోరికను తీర్చాడు.  తల్లి వేషధారణలో వచ్చిన తన తండ్రిని చూసి ఆ చిన్నారి సంతోషాన్ని వ్యక్తం చేశాడు. థాయ్‌లాండ్‌లో నివసిస్తున్న ప్రాచ్య దిబు అనే   తండ్రి సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. చాలామంది పిల్లలు తల్లి లేకుండా  జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమయంలో  తండ్రే  అన్ని బాధ్యతలు నిర్వర్తించాలి.  థాయ్‌లాండ్‌కు చెందిన ప్రాచ్య దిబు  తన కుమార్తెకు ఒక ఉదాహరణగా నిలిచాడు.  అందులో అతను  ఆమెకు తల్లి అయ్యాడు. ఈ తండ్రి తన దత్తపుత్రిక పాఠశాల కార్యక్రమంలో మహిళ కావాలని నిర్ణయించుకున్నాడు. అతని  చర్యకు ప్రజలు అతనికి సెల్యూట్ చేశారు.

ప్రతి ఏటా థాయ్‌లాండ్‌లో మాతృదినోత్సవాన్ని ఆగష్టు 12వ తేదీన జరుపుకొంటారు.  ప్ర్యాచ్యా కుమార్తె  చదువుతున్న పాఠశాలలో తల్లుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే తమ తల్లులను స్కూల్ కు తీసుకురావాలని స్కూల్ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రాచ్యా దిబు పిల్లలకు తల్లి లేదు.    దీంతో పిల్లలను బాధ పెట్టకూడదనే ఉద్దేశ్యంతో  మహిళగా దుస్తులను ధరించి స్కూల్ కు వచ్చాడు. గౌను, క్లిప్ పెట్టుకొని పాఠశాలకు వచ్చాడు. తల్లి వేషధారణలో స్కూల్ కు  ప్రాచ్యా  రావడంతో ఆ పిల్లల ఆనందానికి  అడ్డు లేకుండా పోయింది.   

మదర్స్ డే వేడుకల్లో తన దత్త  కుమార్తెకు తల్లి లేని లోటు కలగకూడదని ప్రాచ్య అనే తండ్రి  తల్లి వేషంలో స్కూలుకు వెళ్లాడు.  ఈ చిత్రాలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి. తన కూతురి స్కూల్ ఫంక్షన్‌కి మహిళ వేషధారణలో ఎలా వెళ్లాడో ఫొటోల రూపంలో వివరించాడు.  ఆ చిత్రాల్లో ప్రాచియా మహిళ గెటప్‌లో కనిపించింది. నిజాని ప్రాచ్య తన కుమార్తె కోసం తల్లిలా దుస్తులు ధరించాడు.  ప్రాచియా అలా చేయడానికి సిగ్గుపడలేదు.  ఫంక్షన్ సమయంలో అతను ముందు కూర్చోవాలని నిర్ణయించుకున్నాడు. అలాగే కార్యక్రమం మొత్తం జరిగే వరకు అక్కడే ఉన్నారు. తన కూతురి ఆనందం కోసం ఓ మహిళగా ఫంక్షన్‌ను ఎంజాయ్ చేస్తూ కనిపించాడు.