సినర్‌@ 350.. మాడ్రిడ్‌ ఓపెన్‌లో ఫైనల్లోకి ఎంట్రీ

సినర్‌@ 350.. మాడ్రిడ్‌ ఓపెన్‌లో ఫైనల్లోకి ఎంట్రీ

మాడ్రిడ్‌: ఇటలీ స్టార్‌ ప్లేయర్‌, వరల్డ్‌ నంబర్‌వన్‌ యానిక్‌ సినర్‌.. మాడ్రిడ్‌ ఓపెన్‌లో ఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో సినర్‌ 6-–2, 6–-4 తేడాతో ఆర్థర్‌ ఫిల్స్‌ (ఫ్రాన్స్‌)పై గెలిచాడు. తద్వారా కెరీర్‌లో 350వ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా 2000 దశాబ్దంలో జన్మించిన వారిలో ఈ మైలురాయిని అందుకున్న తొలి ప్లేయర్‌గా నిలిచాడు. 

అలాగే రోజర్‌ ఫెడరర్‌, నొవాక్‌ జొకోవిచ్‌, రఫెల్‌ నడాల్‌ తర్వాత అన్ని తొమ్మిది మాస్టర్స్‌–1000 ఈవెంట్లలో ఫైనల్‌ చేరిన నాలుగో అతి పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. ఇక ఈ విజయంతో సినర్‌ వరుసగా 22వ మ్యాచ్‌లో గెలుపు రుచి చూశాడు. ఒకవేళ ఆదివారం జరిగే ఫైనల్లో సినర్‌ గెలిస్తే వరుసగా ఐదు మాస్టర్స్‌–1000 టోర్నీలను గెలిచిన మొదటి ప్లేయర్‌గా అరుదైన ఘనత సాధిస్తాడు. టైటిల్‌ ఫైట్‌లో సినర్‌.. అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌తో తలపడతాడు.