హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో గిరిజనులకు ఆరు సీట్లు..

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో గిరిజనులకు ఆరు సీట్లు..

హైదరాబాద్ సిటీ, వెలుగు: బేగంపేట, రామంతపూర్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో 2025–25 సంవత్సరానికి సంబంధించి ఒకటో తరగతిలో ప్రవేశానికి  గిరిజన పిల్లల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఆర్.కోటాజి గురువారం ప్రకటించారు. మొత్తం ఆరు సీట్లు ఉండగా.. బాలురకు 4, బాలికలకు -2  కేటాయించినట్లు తెలిపారు. ఇందులో ఉపకులాల వారీగా లంబాడ 2, ఎరుకల 1, ఇతర గిరిజన తెగలకు -3 సీట్లు రిజర్వ్​ చేసినట్లు పేర్కొన్నారు.

ఎంపిక లాటరీ పద్ధతి ద్వారా జరుగుతుందన్నారు. హైదరాబాద్ జిల్లాకు చెందిన   వారై, 2018 జూన్ 1 నుంచి 2019 మే 31 మధ్య జన్మించిన వారు అర్హులన్నారు. అభ్యర్థుల తల్లిదండ్రుల ఆదాయం రూ.2 లక్షల లోపు ఉండాలన్నారు. ఈ నెల 8 లోపు లక్డికాపూల్ లోని కలెక్టరేట్ లో దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. అలాగే ఎస్సీ కులాల నుంచి ఒకటో తరగతి అడ్మిషన్లకు నాంపల్లి చంద్ర విహార్  లోని ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ అధికారి ఆఫీసులో దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు.