SJ Surya : పదేళ్ల విరామం తర్వాత .. ‘కిల్లర్’ చిత్రంతో దర్శకుడిగా కమ్ బ్యాక్ !

SJ Surya : పదేళ్ల విరామం తర్వాత .. ‘కిల్లర్’ చిత్రంతో దర్శకుడిగా కమ్ బ్యాక్ !

ఒకప్పుడు దర్శకుడిగా పలు సూపర్ హిట్ చిత్రాలను రూపొందించిన ఎస్‌‌ జే సూర్య.. ప్రస్తుతం నటుడిగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. తిరిగి పదేళ్ల విరామం తర్వాత ‘కిల్లర్’ చిత్రంతో దర్శకుడిగా కమ్ బ్యాక్ ఇస్తున్నాడు.  ఈ చిత్రానికి తానే  కథ, స్క్రీన్‌‌ప్లే, డైలాగ్స్ అందిస్తూ,  హీరోగానూ నటిస్తున్నాడు. అలాగే  గోకులం మూవీస్ బ్యానర్‌‌పై గోకులం గోపాలన్‌‌తో కలిసి ఎస్‌‌ జే సూర్య నిర్మిస్తున్నాడు. శనివారం ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్‌‌ను  రిలీజ్ చేశారు. ఇందులో ఎస్ జే సూర్య  బ్లాక్ సూట్‌‌లో  స్టైలిష్‌‌గా కనిపిస్తున్నాడు. 

 ఒకవైపు చేతిలో గన్ పట్టుకుని, రెడ్ డ్రెస్‌‌లో ఫ్లవర్స్‌‌ పట్టుకుని ఉన్న హీరోయిన్  ప్రీతి అస్రానిని భుజాన ఎత్తుకున్న రొమాంటిక్ స్టిల్‌‌ ఇంటరెస్టింగ్‌‌గా ఉంది.  ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని  క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా వైడ్‌‌గా ఈ సినిమా విడుదల చేయనున్నారు.