చెన్నై Vs గుజరాత్ : ఫేస్ టూ ఫేస్ రికార్డ్స్ ఇలా..

చెన్నై Vs గుజరాత్ : ఫేస్ టూ ఫేస్ రికార్డ్స్ ఇలా..

ఇవాళ  చెన్నై, గుజరాత్ టైటాన్స్ మధ్య ఆసక్తికర  మ్యాచ్ జరగబోతుంది.  చెన్నైలోని చెపాక్ గ్రౌండ్ లో ఈ రెండు జట్లు  తలపడనున్నాయి. గతేడాది ఫైనల్లో ఈ రెండు జట్లు పోటీ పడ్డాయి. అపుడు గుజరాత్ పై గెలిచి టైటిల్ సాధించుకుంది చెన్నై.  ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్లో  ఆర్సీబీపై గెలిచిన  చెన్నై అదే ఊపు కంటిన్యూ చేయాలని చూస్తోంది. ఇక   ఆదివారం (మార్చి 24) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ముంబైతో ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో ఆరు పరుగుల తేడాతో ఓడించింది గుజరాత్...ఇపుడు అదే ఉత్సాహంతో చెన్నైని ఓడించాలని చూస్తోంది. 

ఐపీఎల్‌లో ఇప్పటి వరకు  గుజరాత్‌- చెన్నై ఐదు సార్లు  తలపడ్డాయి. ఇందులో గుజరాత్‌దే కాస్త పై చేయిగా ఉంది. ఈ మ్యాచుల్లో గుజరాత్‌ మూడుసార్లు విజయం సాధిస్తే..  చెన్నై రెండుసార్లు విజయం సాధించింది.  ఏప్రిల్ 17న IPL 2022 సీజన్‌లో ఇరు జట్ల మధ్య మొదటి  మ్యాచ్ జరగగా గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్ల తేడాతో గెలిచింది. అదే సీజన్‌లో  మే 15న  మళ్లీ ఇరు జట్లు తలపడగా  టైటాన్స్ మళ్లీ ఏడు వికెట్ల తేడాతో CSKపై విజయం సాధించింది. మళ్లీ 2023లో చెన్నైపై  గుజరాత్ గెలిచింది. క్వాలిఫయర్ 1లో  గుజరాత్ ను చెన్నై 15 పరుగుల తేడాతో ఓడించింది. మళ్లీ 2023 సీజన్  ఫైనల్లో గుజరాత్ ను ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది చెన్నై. 

గుజరాత్ 

శుభమాన్ గిల్ (c), వృద్ధిమాన్ సాహా (WK), సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, స్పెన్సర్ జాన్సన్, శరత్ BR, మోహిత్ శర్మ, అభినవ్ మనోహర్, నొహర్ అహ్మద్, మానవ్ సుతార్, జాషువా లిటిల్, కేన్ విలియమ్సన్, మాథ్యూ వేడ్, జయంత్ యాదవ్, సందీప్ వారియర్, షారుక్ ఖాన్, దర్శన్ నల్కండే, కార్తీక్ త్యాగి, సుశాంత్ మిశ్రా

చెన్నై

 రుతురాజ్ గైక్వాడ్ (సి), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోని (వికెట్), దీపక్ చాహర్, మహేశ్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహమాన్, తుషార్ దేశ్‌పాండే, శార్దూల్ ఠాకూర్, శివం దూబే, శివం దూబే. , మొయిన్ అలీ, మిచెల్ సాంట్నర్, అజయ్ జాదవ్ మండల్, ప్రశాంత్ సోలంకి, ముఖేష్ చౌదరి, సిమర్జీత్ సింగ్, RS హంగర్గేకర్, అరవెల్లి అవనీష్