హైదరాబాద్, వెలుగు: పీఎం- కుసుమ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సోలార్ ఫార్మర్స్ సమ్మిట్ విజయవంతంగా ముగిసింది. నవంబర్ 16, 17 తేదీల్లో హైదరాబాద్లో టీజీపీఎంకేఎఫ్‌ఏ నిర్వహించిన ఈ కార్యక్రమంలో రైతులు, సోలార్ కంపెనీలు, బ్యాంకింగ్ సంస్థలు పాల్గొన్నాయి. ప్లాంట్ల ఏర్పాటు, సబ్సిడీ విధానం, బ్యాంక్ ఫైనాన్సింగ్, పరికరాల నాణ్యత, మెయింటెనెన్స్ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు.
తెలంగాణ స్టేట్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి ముఖ్య అతిథిగా వచ్చారు. ధరలు తగ్గడంతో చిన్న రైతులకూ సోలార్ అందుబాటులోకి వచ్చిందని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ మెగావాట్లు ఉత్పత్తి చేయవచ్చని వివరించారు. టీజీపీఎంకేఎఫ్‌ఏ అడ్వైజర్ సంతోష్ రావు మాట్లాడుతూ, ఈ సమ్మిట్ ద్వారా ఫైనాన్సింగ్, టెక్నాలజీ ఎంపిక రాబడి మోడల్స్ వంటి అన్ని అంశాలను సమగ్రంగా వివరించామని తెలిపారు.
