బుద్దిమారని పాక్.. బార్డర్‌లో బయటపడ్డ భారీ సొరంగం

బుద్దిమారని పాక్.. బార్డర్‌లో బయటపడ్డ భారీ సొరంగం
  • రిపబ్లిక్ డేకు రెండు రోజుల ముందు పాక్ దుశ్చర్య

ఇండియాలో మరో రెండు రోజుల్లో రిపబ్లిక్ డే వేడుకలు జరగనున్నాయి. జనవరి 26ని ఘనంగా జరుపుకునేందుకు యావత్ దేశం సిద్ధమవుతోంది. అయితే దానికి సరిగ్గా రెండు రోజులు ముందు జమ్మూకాశ్మీర్‌లో తీవ్ర కలకలం రేగింది. ఇండియా, పాకిస్తాన్ సరిహద్దులో మరో రహస్య సొరంగమార్గం బయటపడింది. టెరర్రిస్టులను మన దేశంలోకి పంపించేందుకు పాకిస్తాన్ బార్డర్ నుంచి మన దేశంలోకి తవ్విన టన్నెల్ బయటపడింది. బార్డర్ వెంబడి హీరానగర్ సెక్టార్ పన్సార్‌లోని అవుట్ పోస్ట్ ఏరియాలో తవ్విన అండర్ గ్రౌండ్ టన్నెల్ (సొరంగం)ను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ శనివారం గుర్తించింది. ఈ టన్నెల్ 30 అడుగుల లోతులో 150 మీటర్ల పొడవు ఉంది. జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో 10 రోజుల క్రితం జనవరి 13న కూడా ఇలాంటి టన్నెల్‌ను బీఎస్ఎఫ్ గుర్తించింది.

For More News..

హైదరాబాద్​లో 90కి దగ్గర్లో పెట్రోల్ రేటు

పొలంలో రైతు సత్యాగ్రహ దీక్ష

ఆ ఆరుగురు ప్లేయర్లకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్​