
అమేథి లోక్‌సభ ఎన్నికల్లో స్థానిక నాయకుడు హజీ సుల్తాన్ ఖాన్ కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చారు. ఈ సారి ఎన్నికల్లో తన కుమారుడు హజీ హరూన్ రషీద్‌ను అమేథి లోక్‌సభ స్థానం నుంచి రాహుల్‌కు పోటీగా బరిలోకి దింపనున్నారు. గత కొన్నేళ్లుగా స్థానిక నాయకత్వం తమకు పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని.. అందుకే ఈ నిర్ణయం తీసకున్నామని రషీద్ తెలిపారు. తమ వర్గం మొత్తం పార్టీ స్థానిక నాయకత్వం పట్ట అసంతృప్తితో ఉందన్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకత్వం మమ్మల్ని చాలా కాలం నుంచి నిర్లక్ష్యానికి గురిచేస్తుందని తెలిపారు. దీంతో ఈ ప్రాంత అభివృద్ధి కుంటుపడడంతో పాటు ఇక్కడి మా సామాజిక వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది అని రషీద్ తెలిపారు.