
దేవరకొండ (పీఏపల్లి), వెలుగు : తల్లిని చంపిన కేసులో కొడుక్కి జీవిత ఖైదు, రూ.1000 జరిమానా విధిస్తూ నల్గొండ జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ కోర్టు జడ్జి ఎం.నాగరాజు మంగళవారం ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. 2020లో పీఏ పల్లి మండలం బాలాజీనగర్ తండాకు చెందిన మహిళ మెగావత్ బుజ్జిని, కొడుకు మున్నా రోకలిబండతో తలపై కొట్టి చంపాడు. అప్పటి ఎస్ఐ గోపాలరావు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో చార్జి షీట్ దాఖలు చేశారు.
వాదోపవాదాల అనంతరం నిందితుడు మున్నాపై నేరం రుజువు కావడంతో కోర్టు జడ్జి తీర్పు ఇచ్చారు. నిందితుడిపై నేరం రుజువు చేసినందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాణి, గుడిపల్లి ఎస్ఐ డి.నరసింహులు, కోర్టు ఆఫీసర్ నగేశ్‌ను ఎస్పీ శరత్చంద్ర పవార్, దేవరకొండ ఏఎస్పీ మౌనిక అభినందించారు.