ఆస్తి కోసం తండ్రినే కడతేర్చాడు

ఆస్తి కోసం తండ్రినే కడతేర్చాడు

భూమి కోసం కన్న తండ్రినే హతమార్చాడు ఓ కొడుకు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలోనిగూడలో ఈ దారుణం జరిగింది. ఒక ఎకరా భూమి కోసం కన్న తండ్రి నిద్రలో ఉండగా.. దిండుతో ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసినట్లు చెబుతున్నారు పోలీసులు. మృతుడు కర్రె మల్లయ్య మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. నిందితుడు కొడుకు కర్రె వెంకటయ్యతో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు యాచారం పోలీసులు తెలిపారు.