రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణం చేసిన సోనియా గాంధీ

రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణం చేసిన సోనియా గాంధీ

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సెన్ సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏప్రీల్ 4వ తేదీ గురువారం ఉదయం ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్కడ్‌ సోనియా గాంధీ చేత ప్రమాణం చేయించారు. ఇప్పటివరకు లోక్ సభకు ప్రాతినిధ్యం వహించిన  సోనియా గాంధీ.. తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. రాజస్థాన్‌ నుంచి సోనియా ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెలిసిందే. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్థానంలో సోనియా పోటీ చేశారు. ఏప్రిల్ 3వ తేదీతో ఆయన పదవీకాలం ముగిసింది. 

సోనియాతోపాటు మరో 13మంది రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు.  ఈరోజు ప్రమాణం స్వీకారం చేసిన వారిలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, కాంగ్రెస్ కోశాధికారి అజయ్ మాకెన్ లు కూడా ఉన్నారు. ఇక, తెలంగాణ నుంచి బీఆర్ఎస్ నేత వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు.