
కరోనా సెకండ్‌వేవ్ విజృంభిస్తుండగా కొవిడ్పేషెంట్ల కోసం దక్షిణ మధ్య రైల్వే ఐసోలేషన్ కోచ్‌లను మళ్లీ అందుబాటులోకి తెచ్చింది. సమ్మర్ ఎండలను తట్టుకునే విధంగా వీటిని రూపొందించింది. దేశంలోని వివిధ రైల్వే స్టేషన్లలో సుమారు 4,000 కొవిడ్రక్షిత కోచ్‌లు ఏర్పాటు చేశారు. పంజాబ్‌కు కోచ్‌లను పంపేందుకు సిద్ధంగా ఉంచారు. ఢిల్లీలోని షాకూర్బస్తీ స్టేషన్ లో 800 బెడ్లతో 50 కోచ్‌లు, (ఆనంద్‌విహార్ టెర్మినల్ 400 బెడ్లతో 25 కోచ్‌లు, మహారాష్ట్ర నందూర్బర్‌లో 378 బెడ్లతో 21 కోచ్‌లు, బోపాల్ స్టేషన్వద్ద 640 బెడ్లతో 40 కోచ్‌లు ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రాష్ర్ట ప్రభుత్వాల అవసరం మేరకు మరిన్ని ఐసోలేషన్కోచ్లను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.