దక్షిణ కొరియా అధ్యక్షుడిగా యూన్ సుక్ యోల్ ప్రమాణ స్వీకారం

దక్షిణ కొరియా అధ్యక్షుడిగా యూన్ సుక్ యోల్ ప్రమాణ స్వీకారం
  • ఉత్తర కొరియాతో చర్చలు, మార్కెట్ అంశాలపై ప్రసంగం

దక్షిణ కొరియా అధ్యక్షుడిగా కన్జర్వేటివ్ నేత యూన్ సుక్ యోల్ బాధ్యతలు స్వీకరించారు. మాజీ న్యాయవాది అయిన యూన్ మార్చిలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఉత్తర కొరియాతో చర్చలు నిర్వహించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటికే 15 సార్లు క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియాతో సమస్యను పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఫ్రీడమ్, మార్కెట్ అనే అంశాలపై ఆయన ప్రసంగించారు. 
అధ్యక్షుడిగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన యూన్ సుక్..  ప్రమాణస్వీకారానికి 26 లక్షల డాలర్లు ఖర్చు చేశారు. సుమారు 40 వేల మంది గెస్టులను ఆహ్వానించారు. చైనా ఉపాధ్యక్షుడు వాంగ్ కిషాన్, జపాన్ విదేశాంగ మంత్రి యోషిమాష హయషీ, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ భర్త్ డగ్ ఎమాఫ్ లు ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. దక్షిణ  కొరియా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన యూన్ సుక్ యోల్ కు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. 

 

 

ఇవి కూడా చదవండి

శ్రీలంకలో కొనసాగుతున్న నిరసనలు

కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్నాయి

సంక్షేమ పథకాలకు డబ్బుల్లేవు.. కానీ కమీషన్ల కాళేశ్వరానికి కొదవలేదు