సైన్స్ అండ్ టెక్నాలజీ తో అభివృద్ధి : పవన్ కళ్యాణ్

సైన్స్ అండ్ టెక్నాలజీ తో అభివృద్ధి : పవన్ కళ్యాణ్

గాంధీ జీవితం అందరికీ ఆదర్శం కావాలన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.  వరంగల్ నిట్ లో స్ప్రింగ్ ఫ్రీ 2023 వేడుకలకు ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. తాను కాలేజీ, యూనివర్శిటీకి వెళ్లి చదువుకోలేదని.. అక్కడి అనుభవాలు నాకు తెలియవన్నారు. రుద్రమ దేవి నడయాడిన నేలకు రావడం ఆంనందంగా ఉందన్నారు పవన్.

సైన్స్ అండ్ టెక్నాలజీ తో అభివృద్ధి ఆధారపడి ఉందని.. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అనేక అవకాశాలు ఉన్నాయన్నారు పవన్.  ప్రణాళిక బద్దంగా ముందుకు సాగితే క్యాంపస్ ప్లేస్ మెంట్స్ వస్తాయని  తెలిపారు. కళల్లోనూ దేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందన్న పవన్.. దానికి  ఆస్కార్ సాధించిన  నాటు నాటు సాంగ్ నిదర్శనమని పవన్ చెప్పారు.

కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు పవన్.  విజయం సాధించిన వారందరూ ఒక్క ప్రయత్నంలోనే విజయం సాధించలేదన్నారు. అపజయం వచ్చిన పట్టు వదలకుండా విజయం సొంతం చేసుకున్నారని తెలిపారు. గాంధీజీ జీవితం అందరికీ ఆదర్శం తీసుకోవాలని సూచించారు పవన్.  ఎంత ఎదిగినా మానవత్వం మరిచి పోవద్దని సూచించారు పవన్.

 

https://www.youtube.com/watch?v=-tIZ-dhsdZ8