ఊపిరి, రంగస్థలం, హరిహరవీరమల్లు, ప్రేమమ్ లాంటి చిత్రాల్లో కీలక పాత్రలతో ఆకట్టుకున్న పూజిత పొన్నాడ.. వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి, ఓదెల రైల్వే స్టేషన్ చిత్రాల్లో హీరోయిన్‌గా కనిపించింది. ప్రస్తుతం ఆమె ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ ఫేమ్ శ్రీధర్ గాదె తెరకెక్కిస్తున్న హారర్ థ్రిల్లర్‌లో కీలకపాత్ర పోషిస్తోంది. సోమవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా బర్త్ డే విషెస్ చెబుతూ తన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఇందులో ఆమె రాజభవనంలో నర్తకిగా ట్రెడిషనల్ లుక్‌లో కనిపించింది. నటిగా ఆమెకు మంచి గుర్తింపును తెచ్చే సినిమా అవుతుందని మేకర్స్ చెబుతున్నారు. ‘కమిటీ కుర్రోళ్లు’ ఫేమ్ ఈశ్వర్ రాచి రాజు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నందు, లిఖిత హీరోయిన్స్. వెంకట్ తలారి నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. త్వరలో టైటిల్ రివీల్ చేయనున్నారు.
