
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు(SreeVishnu) ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవల సామజవరగమన(Samajavaragamana) సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న శ్రీవిష్ణు.. త్వరలోనే ఓం భీమ్ బుష్(Om Bheem Bush) అనే కామెడీ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. హుషారు ఫేమ్ శ్రీహర్ష కనిగంటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వీ సెల్యులాయిడ్ సంస్థ నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది.
ఇదిలా ఉంటే.. నేడు(ఫిబ్రవరి 29) హీరో శ్రీవిష్ణు పుట్టిన రోజు సందర్భంగా మరో కొత్త సినిమా ప్రకటించాడు. రాజ రాజ చోర సినిమాతో తనకు మంచి హిట్ అందించిన దర్శకుడు హసిత్ గోలితో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ సినిమాకు స్వాగ్ అనే వెరైటీ టైటిల్ ను ఫిక్స్ చేశారు. శ్వాసగానిక వంశానికి స్వాగతం అనేది క్యాప్షన్. ఇందులో భాగంగా విడుదల చేసిన కాన్సెప్ట్ వీడియో చాలా ఆసక్తికరకంగా ఉంది. అడవిలో జంతువులు తమకు బోర్ కొడుతోంది అనగా.. ఒక కోతి వాటికి కథలు చెప్తుంది. అలా చేస్తూ ఉండగా.. మరి నీ కథ ఏంటి అని సింహం కోతిని అడుగుతుంది. నా కథ స్వాగ్ కథ అంటూ చెప్తుంది కోతి.
గ్రాఫిక్స్ లో కనిపించిన జంతువులకి సునీల్, గంగవ్వ చెప్పిన డబ్బింగ్ ఆసక్తికరంగా ఉంది. ఇక కథ చివర్లో ఇది మగవాడిది, శ్వాగణిక వంశానిది అని శ్రీవిష్ణు చెప్పిన డైలాగ్ కూడా చాలా బాగుంది. దీంతో ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతున్నట్టు క్లియర్ గా అర్థమవుతోంది.ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో శ్రీవిష్ణు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.