వరుస తమిళ సినిమాలతో బిజీ అవుతోంది శ్రీలీల. ప్రస్తుతం తమిళంలో మూడు సినిమాలు చేస్తోందామె. వీటిలో రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ‘ధర్మన్’ ఒకటి. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇందులో శ్రీలీల నటిస్తోందంటూ గత కొన్ని నెలలుగా ప్రచారంలో ఉంది. బుధవారం తన బర్త్ డే సందర్భంగా విశెష్ చెబుతూ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ధర్మన్’ టీమ్‌లోకి తనకు వెల్కమ్ చెబుతూ స్పెషల్ వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు.
ఓ మెరుపులా, పటాకాలా తన క్యారెక్టర్ ఉండబోతోందని తెలియజేశారు. రజినీకాంత్ ‘ది డెడ్లీ డాక్టర్’ అనే మిస్టీరియస్ డాక్టర్‌గా నటిస్తుండగా సిమ్రన్, నయనతార, రాశీఖన్నా, యోగిబాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇక ధనుష్‌కు జంటగా ‘ఓం’ చిత్రంలో శ్రీలీల నటిస్తుండగా, బర్త్ డే సందర్భంగా తనకు స్పెషల్ విషెస్ చెప్పారు. ఇందులో ఆమె ‘రోజా’ అనే పాత్రలో నటిస్తోందని తెలియజేస్తూ.. ‘సెంజుదరే’ అనే పాటలోని చిన్న వీడియోను రిలీజ్ చేశారు. ఈనెల 20న సినిమా విడుదల కాబోతోంది. ఇవి రెండు కాక అజిత్ హీరోగా నటిస్తున్న ‘డేర్ డెవిల్’లోనూ శ్రీలీల నటిస్తోంది.
