Om Bheem Bush Collections: ఓం భీమ్ బుష్ బాక్సాఫీస్ కలెక్షన్స్..ఐదు రోజుల్లో ఎంతంటే?

Om Bheem Bush Collections: ఓం భీమ్ బుష్ బాక్సాఫీస్ కలెక్షన్స్..ఐదు రోజుల్లో ఎంతంటే?

హీరో శ్రీవిష్ణు (SreeVishnu), కమెడియన్స్ ప్రియదర్శి (Priyadarshi), రాహుల్ రామకృష్ణ(Rahul Ramakrishna) ప్రధాన పాత్రల్లో వచ్చిన లేటెస్ట్ మూవీ  ఓం భీం బుష్(Om Bheem Bush). అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా యంగ్ డైరెక్టర్ శ్రీహర్ష కొనుగంటి (SreeHarsha konuganti) తెరకెక్కించారు.

నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్ అనే క్యాప్షన్ తో వచ్చిన ఈ సినిమా మార్చ్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్యాప్షన్ కు తగ్గట్టుగానే లాజిక్స్ కి చాలా దూరంగా ఓన్లీ మ్యాజిక్ వర్కౌట్ అయిన ఈ సినిమా తగ్గట్టుగానే ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది.

ఫస్ట్ హాఫ్ కామెడీ, సెకండ్ హాఫ్ హారర్ అండ్ కామెడీ ఎలిమెంట్స్ తో సాగిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి పాజిటీవ్ టాక్ వచ్చింది. ఈ మూవీ ఐదు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.23.85 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకుంది. సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ చేసుకోగా..మరో వీకెండ్ కోసం పరుగులు తీస్తోంది.ఇందుకు తోడు గుడ్ ఫ్రైడే ఫెస్టివల్ కూడా వస్తుండటంతో మరిన్ని కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది.

Also Read: జరగండి..జరగండి ట్యూన్..తమన్ కాపీ కొట్టాడా!..అది ఏ సాంగ్?

రూ.10 కోట్ల కంటే తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా..బ్రేక్ ఈవెన్ సాధించి..అప్పుడే లాభాల బాట పట్టింది. మరి లాంగ్ రన్ లో ఈ మూవీ మరింత ఎక్కువ వసూళ్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయి.  USA లో కూడా ఈ మూవీ సూపర్ ఫామ్ తో దూసుకుపోతోంది. 400K డాలర్లకు పైగా వసూళ్లు సాధించి హాఫ్ మిలియన్ మార్క్ కు దగ్గరలో ఉంది.

ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్న విషయం తెలిసిందే. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఓం భీం బుష్ థియేట్రికల్ రిలీజ్ తరువాత కనీసం నెలరోజుల గ్యాప్ తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఆ ప్రకారం చూసుకుంటే.. ఓం భీం బుష్ సినిమా ఏప్రిల్ చివరి వారంలో ఓటీటీలో స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉంది.